iDreamPost

బన్నీ లైనప్ లో అట్లీ! ఆ సెంటిమెంట్ పక్కన పెట్టేస్తాడా..

  • Author ajaykrishna Published - 08:39 AM, Fri - 8 September 23
  • Author ajaykrishna Published - 08:39 AM, Fri - 8 September 23
బన్నీ లైనప్ లో అట్లీ! ఆ సెంటిమెంట్ పక్కన పెట్టేస్తాడా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2.. వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. పుష్పరాజ్ క్యారెక్టర్ లో బన్నీ యాటిట్యూడ్, యాక్షన్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయ్యాయి. కట్ చేస్తే.. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. రెండేళ్లు ముందు వచ్చిన పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 వస్తుండగా.. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ సినిమా చేయనున్నాడు? ఏ డైరెక్టర్ తో చేస్తాడు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ రాగా.. పుష్ప 2 బన్నీ క్రేజ్ ఇంకా దేశాలు దాటి విస్తరించనుంది. సో.. నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది.

పుష్ప 2 షూటింగ్ దశలో ఉండగానే.. బన్నీ లైనప్ లో నలుగురు దర్శకులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో మొదటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్.. ప్రెజెంట్ రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా 2023 చివరిలో విడుదల కాబోతుంది. దాని తర్వాత సందీప్.. ప్రభాస్ తో స్పిరిట్ చేయాల్సి ఉంది. యానిమల్, స్పిరిట్ ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. సో.. బన్నీ సందీప్ కాంబినేషన్ అధికారికంగా కన్ఫర్మ్ అయినా.. సినిమా ఇప్పట్లో రాకపోవచ్చు అని టాక్.

బన్నీ లైనప్ లో నెక్స్ట్ త్రివిక్రమ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. వీరి కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మంచి విజయాలు నమోదు చేశాయి. పైగా వీరి కాంబోలో నాలుగో మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దాదాపు బన్నీ, త్రివిక్రమ్ ల మూవీ కన్ఫర్మ్ అని అంటున్నారు. కానీ.. త్రివిక్రమ్ ప్రస్తుతం గుంటూరు కారం చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అయ్యేసరికి.. దర్శకుడు బోయపాటి స్కంద రిలీజ్ చేసి ఫ్రీ అవుతాడు. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. బన్నీతో బోయపాటి సినిమా ఇంకోటి ఉంటుందని.. ప్రెజెంట్ స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని నిర్మాత అల్లు అరవింద్ ఆ మధ్య ఓ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు.

తాజాగా సందీప్, త్రివిక్రమ్, బోయపాటిలు కాకుండా కొత్త పేరు తెగ ట్రెండ్ అవుతోంది. రాజారాణి, అదిరింది, తేరి, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు అట్లీ. తాజాగా కింగ్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేశాడు. ప్రస్తుతం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో జర్నీ స్టార్ట్ చేసిన జవాన్.. బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. అట్లీ ఆల్రెడీ బన్నీకి స్టోరీ చెప్పడం జరిగిందట. త్వరలో గుడ్ న్యూస్ కూడా రాబోతుందని స్వయంగా అట్లీనే జవాన్ ప్రమోషన్స్ లో చెప్పడం విశేషం. దీంతో వీరి కాంబినేషన్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే అని ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. మరి ముందుగా లైన్ లో ఉన్న దర్శకులను కాదని.. బన్నీ అట్లీకి గ్రీన్ ఇస్తాడా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. మరి బన్నీ, అట్లీ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి