వన్డే వరల్డ్ కప్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు రెడీ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తున్న టీమిండియా.. తొలి సమరంలో ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రీసెంట్గా ముగిసిన దైపాక్షిక సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించడం, అంతకంటే ముందు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన ఫుల్ జోష్‌లో ఉంది. మొదటి మ్యాచ్‌లోనే ఆసీస్‌ను చిత్తు చేసి ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికలు పంపాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ ఎటాక్‌తో పాటు పేస్ యూనిట్ కూడా రాణించడం కీలకం.
భారత జట్టు పేస్ యూనిట్లో జస్ప్రీత్ బుమ్రా పెర్ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్ అనే చెప్పాలి. బుమ్రా గనుక రాణిస్తే ఆరంభంలోనే వికెట్లు పడతాయి. అప్పుడు ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌లో పడుతుంది. కాబట్టి బుమ్రా ఎలా రాణిస్తాడనేది చూడాలి. బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రూపంలో భారత్ దగ్గర బలమైన పేస్ అటాక్ ఉంది. ఈ యూనిట్‌ను బుమ్రానే ముందుండి నడిపించనున్నాడు. గాయం తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన ఈ పేసుగుర్రం తన ఫామ్‌ను ఘనంగా చాటుకున్నాడు. ఆసియా కప్‌తో పాటు ఇటీవల ఆసీస్‌తో సిరీస్‌లో రాణించి వరల్డ్ కప్‌కు తాను రెడీగా ఉన్నానని చాటాడు. అలాంటి బుమ్రాపై సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు ఇంటర్నేషనల్ మ్యాచుల్లోనూ ఏబీ డివిలియర్స్, జస్ప్రీత్ బుమ్రా చాలాసార్లు పోటీపడ్డారు. అందులో కొన్నిసార్లు రన్స్ చేసి ఏబీడీ ఆధిపత్యం చూపిస్తే.. మరికొన్ని సార్లు అతడ్ని ఔట్ చేసి బుమ్రా తన ప్రతాపం చూపించాడు. అయితే తాజాగా బుమ్రాపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఐపీఎల్లో భాగంగా వాంఖడేలో ఆడిన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌ను గమనించాను. అప్పుడు అతను 130 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ వేసేవాడు. కానీ ఒక ఏడాది గ్యాప్‌లో బుమ్రా తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. నెక్స్ట్ ఐపీఎల్లో అతను 140 కి.మీ.ల వేగంతో బాల్స్ వేశాడు. అప్పుడు అతడిలో ఎంత సత్తా ఉందో తెలుసుకున్నా. ఆ రోజు బుమ్రా నా కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడు. అతడు నాకు సవాల్ విసురుతున్నాడని అర్థమైంది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! వందే భారత్ రైళ్లలో..
AB De Villiers said, “Jasprit Bumrah was in his 130s when I played him at the Wankhede. Not even a year later, I saw a completely different Bumrah running in. He was clocking the 140 mark with fire in his belly, making eye contact with me. I knew the challenge was on”. pic.twitter.com/ZXxyuLEUlD
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 6, 2023