iDreamPost

హ‌రిహ‌రా… ప‌వ‌న్ దెబ్బ‌కి ఆ ముగ్గురిలో టెన్ష‌న్

హ‌రిహ‌రా… ప‌వ‌న్ దెబ్బ‌కి ఆ ముగ్గురిలో టెన్ష‌న్

ప‌వ‌న్ క‌ళ్యాన్ అంటే నిర్మాత‌ల‌కు క్రేజీకాని, ఆయ‌నతో సినిమా అంటే హ‌డల్. ఆయ‌న ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తారో! ఎప్పుడు సారీ, కేన్స‌ల్ అంటో తెలియ‌దు. అయినాస‌రే, మా బ్యాన‌ర్ లో ప‌వ‌న్ సినిమా ఒక‌టి ఉండాల‌ని కోరుకొనే నిర్మాత‌లు చాలామందే ఉన్నారు. కొంత‌మందికి సినిమా చేస్తాన‌న్న‌ భరోసాకూడా ఇచ్చారు. అంద‌రూ ఒక‌రిత‌ర్వాత ఇంకొక్క‌రు అన్న‌ట్లు, క్యూలో ఉన్నారు.

ఈలోగా, ద‌సరా నుంచి రోడ్లపైనే ఉంటా, ప్రజా సమస్యలపై ఊరూరా తిరుగుతాన‌ని పవన్ ప్ర‌క‌టించ‌గానే సినిమాలు తీస్తున్న నిర్మాతల గుండెల్లో బాంబుపేలిన‌ట్ల‌య్యింది. ద‌స‌రా నుంచి పాలిటిక్స్ అంటున్నారు. ఒక‌వేళ ఆ త‌ర్వాత సినిమాలు ఆపేస్తే? ఆయనతో సినిమాలు సెట్స్ లో ఉన్న‌ నిర్మాతల పరిస్థితేంటి? టెన్షన్…టెన్ష‌న్. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కొన్నిరోజులైనా రాజకీయం చేయ‌క‌పోతే, జ‌న‌సేన ప‌రిస్థితి గ‌జిబిజి అయ్యే ఛాన్స్ ఉంది. ఆయ‌న త‌ప్ప పార్టీకి వేరే అండ లేదు. అందువ‌ల్ల ద‌స‌రా నుంచి పవన్ రోడ్లపైకి వస్తే, హీరోగా చేస్తున్న‌ సినిమాలు ఆగిపోయినట్టేనా? అందుకే, త‌మ‌కు తెలిసిన వాళ్ల ద్వారా ప‌వ‌న్ పొలిట‌క‌ల్ ప్లానింగ్ ఏంటో తెలుసుకోవడానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు నిర్మాత‌లు. స‌రాస‌రి ప‌వ‌న్ అడ‌గ‌లేరుక‌దా!

ఏఎం ర‌త్నం చాలా ఆశ‌లు పెట్టుకున్న సినిమా హరిహర వీరమల్లు . చాలా ఏళ్ల క్రిత‌మే మొద‌లైంది. ముందుకీ వెన‌క్కి అన్న‌ట్లుగా ఈ సినిమా న‌డుస్తోంది. యాక్ష‌న్ సీన్స్ ప‌ట్ల ప‌వ‌న్ హ్యాపీ అని కొన్నిసార్లు, కాదు మొత్తం సినిమా క్వాలిటీ మీద‌నే ఆయ‌న‌కు డౌటుంద‌ని మ‌రికొన్నిసార్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. క్రిష్ రెడీగాఉన్నా, పవన్ కల్యాణ్ కాల్షీట్స్ ఎక్కువ‌గా దొర‌క‌లేదు. మ‌ధ్య‌లో చాలా సినిమాలు చొర‌బడ్డాయి. రిలీజ్ అయిపోయాయి. మ‌రీ ఈ సినిమా దసరాకి అయినా కొలిక్కి వస్తుందా? రత్నం ఈ సినిమా కోసం చాలా అప్పులు తెచ్చారు. దసరా లోపు సినిమా పూర్తిచేసి, రిలీజ్ కాక‌పోతే ర‌త్నం ప‌రిస్థితి మ‌రింత దెబ్బ‌తినేలా ఉంది.

ఈ సినిమా చాలావ‌ర‌కు పూర్త‌య్యింది. అంద‌వ‌ల్ల ద‌స‌రాకు పూర్తికావ‌చ్చ‌న్న‌ది గ‌ట్టిఆశ‌. గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి హిట్ కొట్టాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్న హ‌రీశ్ శంక‌ర్ తో సినిమా ప్రకటించి చాలా రోజులైంది. మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్స్ పవన్ దగ్గర ఐదారేళ్లుగా ఉంది. ప‌వ‌న్ తో ఎలాగైనా సినిమా చేయాల‌న్న‌ది మైత్రీవాళ్ల కోరిక‌. సురేందర్ రెడ్డికి ప‌వ‌న్ మాట ఇచ్చారు. ఆ మూవీ ప్రకటన కూడా వచ్చింది. రామ్ తళ్లూరి కూడా సురేందర్ రెడ్డి సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారు.

ద‌స‌రాకి కొబ్బ‌రికాయ కొట్టాని హ‌రీశ్ శంక‌ర్ చాలా ట్రైచేస్తున్నాడు. సినిమాకు మైత్రీ నిర్మాతలు కూడా రెడీ. ఈ స‌మ‌యంలో టైమ్ లో పవన్ కల్యాణ్ దసరా బాంబ్ పేల్చారు. ఒక‌వేళ ప‌వ‌న్ రాజకీయాలకు వెళ్లిపోతే హరీశ్ ప‌రిస్థితి ఏంటి? రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడుమ‌రి. సురేందర్ రెడ్డి చేతిలో ఇంకో సినిమా ఉందికాబ‌ట్టి నో ప్రొబ్ల‌మ్.

ఇప్పుడు స‌మ‌స్య అంతా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుదే. క్రిష్ షెడ్యూల్ కి సిద్ధ‌మైన‌ప్పుడ‌ల్లా, కొత్త సినిమా మ‌ధ్య‌లో ఊడిప‌డుతోంది. లేటెస్ట్ గా, త్రివిక్రమ్ లాబీయింగ్ తో, వినోదాయ శితం రీమేక్ ముందుకొచ్చింది. 20రోజుల కాల్ షీట్లు. నెల‌లో హీరో పోర్ష‌న్ లాగించేయొచ్చ‌ని అనుకొంటున్న వేళ, పవన్ కల్యాణ్ వాళ్ల‌కు షాక్ ఇచ్చారు. ద‌స‌రాకి మూడునెల‌ల టైం ఉంది. ఈలోగా ఈ సినిమాను పూర్తిచేయ‌క‌పోతే నిర్మాత‌లు అడ్డంగా దొరికిపోతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి