iDreamPost
android-app
ios-app

ఆ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ..!

ఆ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ..!

ఈ రోజుల్లో తెలిసి తెలియని వయసులో చాలా మంది యువతి, యువకులు ప్రేమా, గీమా అంటూ చదువును పక్కనబెట్టి చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇక ఒకరినొకరు ఇష్టపడడంతో ప్రేమ విహారంలో తేలియాడుతున్నారు. అలా కొంత కాలం పాటు సాగిన వీరి ప్రేమాయణం చివరికి ఊహించని మలుపుకు తిరుగుతుంది. దీంతో తట్టుకోలేక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకుంది. అయితే అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాలోని వెంగళపురం గ్రామంలో అంతెల్పుల రాకేష్ (22) అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఈ యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమించినట్లుగా తెలుస్తుంది. అలా ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమ వ్యవహరాన్ని నడిపారు. రాకేష్ మాత్రం ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తన ప్రియురాలికి చెప్పాడు. కానీ, ఆ యువతి ఇతడితో పెళ్లికి నిరాకరించింది.

ప్రియురాలు అలా చేయడంతో రాకేష్ తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రాకేష్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని అతని తల్లిండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి