iDreamPost

ఖాకీ VS క్రిమినల్.. OTTలో ఉన్న.. ది బెస్ట్ పోలీస్ క్రైమ్ డ్రామా..!

OTT Suggestions- Best Crime Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలామంది వెబ్ సిరీస్లు చూడటానికి బాగా అలవాటు పడ్డారు. అయితే వాటిలో ఏ వెబ్ సిరీస్ చూడాలి అనేది క్లారిటీ ఉండదు. అలాంటి వారి కోసం బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Crime Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలామంది వెబ్ సిరీస్లు చూడటానికి బాగా అలవాటు పడ్డారు. అయితే వాటిలో ఏ వెబ్ సిరీస్ చూడాలి అనేది క్లారిటీ ఉండదు. అలాంటి వారి కోసం బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి తీసుకొచ్చాం.

ఖాకీ VS క్రిమినల్.. OTTలో ఉన్న.. ది బెస్ట్ పోలీస్ క్రైమ్ డ్రామా..!

చాలామందికి వెబ్ సిరీస్లు చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే సినిమాలు అయితే ప్రతిసారి వెతుక్కుని చూడాలి అనేది పెద్ద సమస్య. అంతేకాకుండా సినిమాలకంటే వెబ్ సిరీస్లలో మంచి కథ, ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ నరేషన్ ఉంటుంది. ఒక్కసారి మంచి వెబ్ సిరీస్ చూస్తే.. మీరు ఇంక వెబ్ సిరీస్లకు అలవాటు పడిపోతారు. కాకపోతే వెబ్ సిరీస్లు చూడాలంటే కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి. అలాగే వీకెండ్లలో ప్లాన్ చేసుకుంటే సిరీస్ మొత్తాన్ని ఒకేసారి చూసేయచ్చు. కాకపోతే మిమ్మల్ని అంతగా ఎంగేజ్ చేసే కథ కలిగిన వెబ్ సిరీస్ మీకు దొరకాలి. అలాంటి వెబ్ సిరీస్ మీకు దొరికితే మాత్రం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. అలాంటి ఒక వెబ్ సిరీస్ మీకోసం తీసుకొచ్చాం.

ఇప్పుడు చెప్పుకుంటున్నది ఒక బెస్ట్ కాప్ స్టోరీ గురించి. ఒక సస్పెన్స్ క్రైమ్ డ్రామా ఇది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. నిజానికి ఈ వెబ్ సిరీస్ వచ్చి రెండేళ్లు కావొస్తోంది. కాకపోతే చాలామందికి ఈ వెబ్ సిరీస్ గురించి తెలియక లైట్ తీసుకున్నారు. ఐఎండీబీ రేటింగ్ కూడా 8.1/10 ఉంది. ఇది ఒక బెస్ట్ వెబ్ సిరీస్ అని 12 వేల మందికి పైగా ఆడియన్స్ ఓట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ పేరు మరేదో కాదు.. ఖాకీ: ది బిహార్ ఛాప్టర్. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల వరకు ఉంటుంది. దీనిని బాగా ఫ్రీగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్లీ ఆపడం కష్టం అవుతుంది.

ఇది మొత్తం ఒక ఉత్తమ పోలీస్ ఆఫీసర్, ఒక కరుడు గట్టిన క్రిమినల్ కు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. ఒక నిజాయతీ కలిగిన పోలీస్ అధికారి.. బిహార్ లో ఉండే ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ ని పట్టుకునేందుకు పూనుకుంటాడు. అయితే అతను అలాంటి ఇలాంటి క్రిమినల్ కాదు. పైగా సిస్టమ్ లో ఉండే కరప్షన్ కూడా ఆ పోలీస్ ఆఫీసర్ కి ఛాలెంజింగ్ గా మారుతుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో ఉండే మలుపులు ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

అలాగే ముఖ్యంగా పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. అలాగే పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. మొత్తానికి వెబ్ సిరీస్ లవర్స్ కు ఇది ఒక మంచి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. కరణ్ ఠాకర్, అవినాష్ తివారీ, అభిమన్సు సింగ్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు కార్తీ నటించిన ఖాకీ సినిమా గుర్తొస్తుంటుంది. ఈ సిరీస్ లో కూడా సీన్స్ అలాంటి ఇన్ టెన్స్ ని కలిగిస్తాయి. మరి.. ఇంకెందుకు ఆలస్యం నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ ఖాకీ వెబ్ సిరీస్ చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి