iDreamPost

HYDలో రూ.12 లక్షలకే 110 గజాల స్థలం! ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు

నార్త్ హైదరాబాద్ లో, వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న ఏరియాల్లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ ఏరియాల్లో స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయో ముందు కథనాల్లో చెప్పాము. ఈ కథనంలో ఈస్ట్ హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడ తక్కువగా ఉన్నాయి? 110 గజాల స్థలం 12 లక్షలకే ఏ ఏరియాలో దొరుకుతుంది అనే వివరాలు తెలుసుకుందాం.

నార్త్ హైదరాబాద్ లో, వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న ఏరియాల్లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ ఏరియాల్లో స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయో ముందు కథనాల్లో చెప్పాము. ఈ కథనంలో ఈస్ట్ హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడ తక్కువగా ఉన్నాయి? 110 గజాల స్థలం 12 లక్షలకే ఏ ఏరియాలో దొరుకుతుంది అనే వివరాలు తెలుసుకుందాం.

HYDలో రూ.12 లక్షలకే 110 గజాల స్థలం! ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు

హైదరాబాద్ లో ల్యాండ్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే సరసమైన, సౌలభ్యమైన, విలాసవంతమైన ప్రాపర్టీస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈస్ట్ హైదరాబాద్ పెట్టుబడికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. మరి ఈస్ట్ హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడ తక్కువగా ఉన్నాయో అనే వివరాలు మీ కోసం. 

ఎల్బీ నగర్ లో చదరపు అడుగు స్థలం ధర సగటున రూ. 6,500/-గా ఉంది. ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు ప్రారంభ ధర చదరపు అడుగుల్లో రూ. రూ. 1150/- నుంచి కొనసాగుతుంది. పోచారంలో ల్యాండ్ రేట్లు చదరపు అడుగు వచ్చి రూ. 2,200 నుంచి రూ. 7600 రేంజ్ లో ఉంది. నాగోల్ లో చదరపు అడుగు స్థలం ధర రూ.  1800 నుంచి 7,600 మధ్య కొనసాగుతుంది. కొత్తపేటలో చదరపు అడుగు ల్యాండ్  ప్రారంభ ధర రూ. 1500 ఉండగా సగటు ధర రూ. 6700/-గా ఉంది. హస్తినాపురంలో చదరపు అడుగు ప్లాట్ రూ. 5,600 నుంచి 9 వేల మధ్య పలుకుతుంది. బోడుప్పల్ లో రూ. 5,200 నుంచి రూ. 7 వేల వద్ద పలుకుతుంది. పీర్జాదిగూడలో రూ. 6,100, ఘట్కేసర్ లో రూ. 1450/- గా కొనసాగుతుంది.

LB nagar

మలక్ పేటలో చదరపు అడుగు ధర రూ. 5,900 నుంచి రూ. 10,100 రేంజ్ లో పలుకుతుంది. మలక్ పేట్ లో ల్యాండ్ ప్రారంభ ధర చదరపు అడుగుకి రూ. 4500 పడుతుంది. హయత్ నగర్ లో ప్రారంభ ధర రూ. 4 వేలు వద్ద ఉండగా.. సగటు ధర రూ. 6,250 వద్ద కొనసాగుతుంది. ఇక ఉప్పల్ లో చదరపు అడుగు ల్యాండ్ కాస్ట్ రూ. 4,550 నుంచి రూ. 8,100 వద్ద కొనసాగుతుంది. నాచారంలో రీసెంట్ గా జరిగిన లావాదేవీల ప్రకారం చదరపు అడుగు స్థలం సగటు ధర రూ. 2540 పలుకుతుంది. మామూలుగా అయితే 5 వేల నుంచి 12 వేల మధ్య పలుకుతుంది. మల్లాపూర్ లో చదరపు అడుగు ల్యాండ్ ప్రారంభ ధర రూ. 4000 ఉండగా.. సగటు ధర రూ. 6,250 వద్ద కొనసాగుతుంది.

కాప్రాలో చదరపు అడుగు ల్యాండ్ ధర రూ. 5,800 నుంచి రూ. 7,400 రేంజ్ లో పలుకుతుంది. చర్లపల్లిలో చదరపు అడుగు స్థలం ప్రారంభ ధర రూ. 4,550 ఉండగా.. సగటు ధర రూ. 6,400 వద్ద కొనసాగుతుంది. ఈ ఏరియాలో హయ్యెస్ట్ రేటు రూ. 9,900/-గా ఉంది. కుంట్లూరులో సగటు ధర రూ. 1685 ఉండగా.. రూ. 2,800, రూ. 3,400 రేంజ్ లో కొనసాగుతుంది. ఈస్ట్ హైదరాబాద్ లో స్థలం రేట్లు తక్కువ ధరకి వచ్చే ఏరియాలంటే ఎల్బీ నగర్, పోచారం, నాగోల్, కొత్తపేట, ఘట్కేసర్, కుంట్లూరు ఏరియాల్లో తక్కువ రేటుకి స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా ఏరియాల్లో మాత్రం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే బడ్జెట్ ని బట్టి ఈ ఏరియాల్లో ఎక్కడ కొనుగోలు చేసినా లాభమే అని నిపుణులు అంటున్నారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి