iDreamPost

ఇంగ్లండ్ WC టీమ్ ప్రకటన.. ఆ నలుగురు ఆడినా కప్పు వాళ్లదే!

  • Published Apr 30, 2024 | 3:21 PMUpdated Apr 30, 2024 | 3:21 PM

ఇంగ్లండ్ తమ టీ20 వరల్డ్‌ కప్ టీమ్​ను ప్రకటించింది. విధ్వంసకారులంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంగ్లీష్ స్క్వాడ్.

ఇంగ్లండ్ తమ టీ20 వరల్డ్‌ కప్ టీమ్​ను ప్రకటించింది. విధ్వంసకారులంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంగ్లీష్ స్క్వాడ్.

  • Published Apr 30, 2024 | 3:21 PMUpdated Apr 30, 2024 | 3:21 PM
ఇంగ్లండ్ WC టీమ్ ప్రకటన.. ఆ నలుగురు ఆడినా కప్పు వాళ్లదే!

ఐపీఎల్ సెకండాఫ్​ జోరుగా సాగుతోంది. ప్లేఆఫ్స్​కు టైమ్ దగ్గర పడుతుండటంతో అందరూ ఈ మ్యాచ్​లపై ఫోకస్ చేస్తున్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్ హడావుడి నడుస్తున్న టైమ్​లోనే మరోవైపు టీ20 వరల్డ్ కప్-2024 గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. పొట్టి ప్రపంచ కప్​ స్టార్ట్ అవడానికి ఇంకో నెల రోజుల వ్యవధి కూడా లేదు. దీంతో ఒక్కో దేశం తమ వరల్డ్ కప్ స్క్వాడ్స్​ ప్రకటిస్తున్నాయి. నిన్న న్యూజిలాండ్, ఇవాళ సౌతాఫ్రికా తమ టీమ్స్ గురించి అనౌన్స్​మెంట్ చేయగా.. ఇప్పుడు ఇంగ్లీష్​ జట్టు వంతు వచ్చింది. 15 మందితో కూడిన తమ వరల్డ్ కప్ స్క్వాడ్​ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జాస్ బట్లర్ కెప్టెన్​గా వ్యవహరించనున్న ఈ టీమ్​లో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

బట్లర్​తో పాటు ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్​లో సాల్ట్, విల్ జాక్స్, జానీ బెయిర్​స్టో, బ్రూక్, లియామ్ లివింగ్​స్టన్, బెన్ డకెట్ కీలకం కానున్నారు. స్పిన్ ఆల్​రౌండర్​గా మొయిన్ అలీ, పేస్ ఆల్​రౌండర్​గా సామ్ కర్రన్​ను ఇంగ్లీష్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. పేస్ బాధ్యతల్ని జోఫ్రా ఆర్చర్, జోర్డాన్, మార్క్ వుడ్, రీస్ టోప్లే పంచుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్​గా అదిల్ రషీద్​ను సెలెక్ట్ చేశారు. అయితే సరిగ్గా గమనిస్తే విధ్వంసకారులంతా ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో ఇంగ్లండ్ స్క్వాడ్ అలాగే ఉందని చెప్పొచ్చు. బట్లర్ దగ్గర నుంచి సాల్ట్, విల్ జాక్స్, బెయిర్​స్టో, లివింగ్​స్టన్ వరకు అందరూ బ్యాటింగ్​లో చిచ్చరపిడుగులే.

ఏ టీమ్​లో లేని రీతిలో ఇంగ్లండ్​ జట్టులో ఆల్​రౌండర్లు ఎక్కువ. దాదాపుగా అందరూ బ్యాట్​తో కనీసం పరుగులు చేయగలిగేవారే. అవసరమైన టైమ్​లో బ్యాట్ ఝళిపించే సత్తా ఆ టీమ్​లోని పేసర్లు, స్పిన్నర్లకు ఉంది. మొయిన్ అలీ, సామ్ కర్రన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ అటు బంతితో మెరుస్తూనే బ్యాట్​తో విలువైన పరుగుల్ని స్కోరు బోర్డుకు జోడించగలరు. కర్రన్, అలీ ఫామ్​లో ఉంటే మ్యాచ్​ను సింగిల్ హ్యాండ్​తో మార్చేస్తారు. లివింగ్​స్టన్, విల్ జాక్స్ లాంటి బ్యాటర్లు స్పిన్ బౌలింగ్​తో టీమ్​కు అవసరమైనప్పుడు బ్రేక్ త్రూలు అందించడంలో సిద్ధహస్తులు. టోటల్​గా బట్లర్ సేన చాలా దుర్భేద్యంగా ఉంది. ప్రధాన పేసర్ ఆర్చర్ కరెక్ట్ టైమ్​కు ఫిట్​గా మారడం జట్టుకు అదనపు బలమనే చెప్పాలి. జాక్స్, బట్లర్, ఆర్చర్, కర్రన్.. ఈ నలుగురు సరిగ్గా ఆడితే ఆ టీమ్​ను ఆపడం ఎవరి వల్లా కాదు. మరి.. ఇంగ్లండ్ వరల్డ్ కప్ టీమ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి