iDreamPost

HYDలో లేడీ డాన్.. పైకి మాత్రం పద్ధతిగా.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేసింది!

  • Published Apr 30, 2024 | 3:42 PMUpdated Apr 30, 2024 | 3:42 PM

ఈ మధ్య కాలంలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి లేనిపోని దందాలు, స్కామ్ లు, సైబర్ నేరాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో లక్షల కొలది నగదును సంపాదిస్తున్న ఓ గేమింగ్ ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

ఈ మధ్య కాలంలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి లేనిపోని దందాలు, స్కామ్ లు, సైబర్ నేరాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో లక్షల కొలది నగదును సంపాదిస్తున్న ఓ గేమింగ్ ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Apr 30, 2024 | 3:42 PMUpdated Apr 30, 2024 | 3:42 PM
HYDలో లేడీ డాన్.. పైకి మాత్రం పద్ధతిగా.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేసింది!

ఈ మధ్య కాలంలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి లేనిపోని దందాలు, స్కామ్ లు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించాలనే మనిషి అత్యాశనే అవకాశంగా మార్చుకుంటు ఇటీవల కాలంలో ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించాలనే యాతనతో అమాయకులను మోసం చేస్తున్నారు. అయితే ఈ మోసాల బారినపడేవాళ్లో ఎక్కువశాతం చదువుకున్నవాళ్లు, ఉన్నతఉద్యోగాలు చేసేవారు ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా.. ఈ మధ్య నగరంలో గేమింగ్ ముఠా అనేది ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఈ దందాలో ఎక్కువగా బడా వ్యాపారస్తులనే లక్ష్యంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా నగరంలో లక్షల కొలది నగదును సంపాదిస్తున్న ఓ గేమింగ్ ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలోని బడా వ్యాపారస్తులే లక్ష్యంగా చేసుకుంటూ.. ఓ గేమింగ్ ముఠా పెద్ద ఎత్తునే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ గేమింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయితే ఆ గేమింగ్ స్థావరాన్ని నిర్వహిస్తున్నది ఓ మహిళ కావడం విశేషం. కాగా, ఈజీ మనీకి అలవాటుపడిన ఓ కేలేడీ డాన్.. ఏకంగా ఇంట్లోనే జూదం దుకాణం ఓపెన్ చేసింది. ఈ క్రమంలోనే వ్యాపారస్తులను టార్గెట్ చేసి వారిని గేమింగ్‌లోకి దింపుతోంది. ఇక పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారి దగ్గర నుంచి రూ. 62 వేల నగదును సీజ్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. నగరానికి చెందిన మాధవి అనే మహిళ బడా వ్యాపారులకు వల వేసి వారిని గేమింగ్‌ (మూడు ముక్కలాట)లోకి దింపుతోంది.

అయితే రాయదుర్గం పీఎస్ పరిధిలోని ఖాజాగూడ అట్లాంటిక్స్ అపార్ట్‌మెంట్‌లో..  ఈ గేమింగ్ స్థావరాన్ని గుట్టుగా  ఏర్పాటు చేస్తుంది. కాగా, గత కొంత కాలంగా ఈ గేమింగ్ ను అక్రమంగా కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఫంటర్స్‌ను పిలిపించి పెద్దఎత్తున గేమింగ్ నిర్వహిస్తోంది. పైగా ప్రతి ఆటకు రూ 1000 చొప్పున ఆర్గనైజర్ ఫీజును వసూలు చేస్తుంది. ఇలా రోజు మొత్తంలో దాదాపు 100కు  పైగా గేములు నిర్వహించి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తోంది. అంతేకాకుండా.. వారికి ఇంట్లోనే మద్యం కూడా సరఫరా చేస్తూ అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతోంది.

కాగా, ఇటీవలే కొంతమంది బడా వ్యాపారస్తులు ఈ గేమింగ్ లో లక్షల రూపాయాలు నష్టపోయారు. దీంతో సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఖాజాగూడలోని గేమింగ్ స్థావరంపై  ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో రూ.62 వేల నగదు, 11 సెలఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ సీజ్ చేశారు. అలాగే 9 మందిని అరెస్ట్ చేసి వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరి, నగరంలో ఒక మహిళ గేమింగ్ ముఠాను కొనసాగిస్తూ లక్షల రూపాయాలు సంపాదిస్తున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి