iDreamPost

OTT Suggestion: అడ్వెంచర్ మూవీస్ అంటే ఇష్టమా? OTT లో ఉన్న ఈ బెస్ట్ మూవీస్ చూశారా?

  • Published Apr 30, 2024 | 3:55 PMUpdated Apr 30, 2024 | 3:55 PM

ఓటీటీ లో కొత్తగా వచ్చే సినిమాలన్నీ చూసేసి బోర్ కొట్టేసి ఉంటే.. ఓటీటీ లో ఉన్న టాప్ రేటెడ్ అడ్వెంచర్ మూవీస్ ని మాత్రం అస్సలు మిస్ కాకండి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

ఓటీటీ లో కొత్తగా వచ్చే సినిమాలన్నీ చూసేసి బోర్ కొట్టేసి ఉంటే.. ఓటీటీ లో ఉన్న టాప్ రేటెడ్ అడ్వెంచర్ మూవీస్ ని మాత్రం అస్సలు మిస్ కాకండి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

  • Published Apr 30, 2024 | 3:55 PMUpdated Apr 30, 2024 | 3:55 PM
OTT Suggestion: అడ్వెంచర్ మూవీస్ అంటే ఇష్టమా? OTT లో ఉన్న ఈ  బెస్ట్ మూవీస్ చూశారా?

ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చే సినిమాల గురించి, సిరీస్ ల గురించి అందరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటున్నారు. తెలుసుకుంటూనే ఉంటున్నారు. కానీ, వీటిని చూస్తూ.. ఓటీటీ లో ఉండే కొన్ని మంచి సినిమాలను, సిరీస్ లను మిస్ అయిపోతున్నారు మూవీ లవర్స్. అలాంటి వారి కోసమే ఈ సజ్జెషన్. సస్పెన్స్, హర్రర్ చిత్రాలంటే అందరికి ఇష్టమే.. అయితే వాటితో పాటు అడ్వెంచర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే టాప్ రేటెడ్ అడ్వెంచర్ చిత్రాలను మీరు మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఆ చిత్రాలు, సిరీస్ లు ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి.. అనే విషయాలను చూసేద్దాం.

అడ్వెంచర్ మూవీస్ అన్నీ కూడా మూవీ లవర్స్ ను సరికొత్త ప్రపంచానికి తీసుకుని వెళ్తాయి. దీనితో.. ప్రేక్షకులు కూడా ఆయా సినిమాలను మరింత ఆసక్తిగా చూడడం మొదలు పెట్టారు. మరి ఓటీటీ లో ఉన్న టాప్ రేటెడ్ అడ్వెంచర్ సినిమాలు/ సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

1.ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ద రింగ్ – నెట్‌ఫ్లిక్స్
ఈ సిరీస్ ఫ్రాంచైజ్ వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్ అయింది. ఈ సిరీస్ 2001 లో వచ్చింది. ఈ సిరీస్ అడ్వెంచర్ మూవీస్ చూసేవాళ్లకు బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమా 8.9 రేటింగ్ దక్కించుకుంది. అంతే కాకుండా ఈ మూవీ మూడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ తో పాటు.. ప్రైమ్ వీడియో, జియో సినిమాలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ మూవీని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ రేటెడ్ అడ్వెంచర్ సినిమా/ సిరీస్ లు ఇవే

1. అప్:
ఇది ఒక యానిమేషన్ సినిమా. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్లకు ఈ యానిమేషన్ సినిమాలు బాగా నచ్చేస్తాయి. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే తన భార్య కల అయిన ఓ ప్యారడైజ్ ఫాల్స్ ను వెతుక్కుంటూ.. ఎగిరే ఇంటిలో వెళ్లే ఓ వృద్ధుడు చేసే.. అడ్వెంచర్ ఈ అప్ సినిమా. ఈ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 8.3 రేటింగ్ దక్కించుకుంది.

2.పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్: ది కర్స్ ఆఫ్ ద బ్లాక్ పెర్ల్ – హాట్‌స్టార్
ఇప్పుడు పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ సిరీస్ సీజన్స్ అన్ని కూడా తెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ సిరీస్ నుంచి 2003 లో వచ్చిన ది కర్స్ ఆఫ్ ద బ్లాక్ పర్ల్ మూవీ కి మంచి ఆదరణ లభించింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమా 8.1 రేటింగ్ దక్కించుకుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ రేటెడ్ అడ్వెంచర్ సినిమా/ సిరీస్ లు ఇవే

1. ఇంటర్‌స్టెల్లార్ :
ఈ సినిమా 2014 లో వచ్చింది. ఈ సినిమాకు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 8.7 రేటింగ్ దక్కించుకుంది. ఒక సామాబియా రైతు, నాసా మాజీ సైంటిస్ట్ కలిసి.. మనుషులు జీవించడానికి ఇంటర్ స్టెల్లార్ లో ఉన్న ఓ కొత్త భూమిని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ క్రమంలో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

2. లైఫ్ ఆఫ్ పై:
ఈ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 7.9 రేటింగ్ దక్కించుకుంది. ఓ చిన్న బోట్ లో పులితో పాటు చిక్కుకుపోయిన పటేల్ అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. నడి సముద్రంలో చిక్కుకుపోయిన అతను ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి