iDreamPost

Mulugu: నదిలో కొట్టుకుపోతున్న తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి!

  • Published Apr 30, 2024 | 3:41 PMUpdated Apr 30, 2024 | 6:33 PM

తం‍డ్రి కోసం ఆ బిడ్డ చేసిన సాహసం వారి ఇంట తీరని విషాదాన్ని నింపింది. పాపం ఇలా జరుగుతుందని వారు ఏమాత్రం ఊహించలేదు. ఇంతకు ఏం జరిగిందంటే..

తం‍డ్రి కోసం ఆ బిడ్డ చేసిన సాహసం వారి ఇంట తీరని విషాదాన్ని నింపింది. పాపం ఇలా జరుగుతుందని వారు ఏమాత్రం ఊహించలేదు. ఇంతకు ఏం జరిగిందంటే..

  • Published Apr 30, 2024 | 3:41 PMUpdated Apr 30, 2024 | 6:33 PM
Mulugu: నదిలో కొట్టుకుపోతున్న తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి!

తండ్రి అంటే పిల్లలకు భయం, భక్తి, గౌరవం, ప్రేమ ఉంటాయి. కానీ ఆడపిల్లల విషయానికి వస్తే.. వారికి తండ్రి మీద కాస్త ప్రేమ ఎక్కువ. ఆడపిల్లకు నాన్ననే హీరో.. బెస్ట్‌ఫ్రెండ్‌. తండ్రి కూడా బిడ్డలో తల్లిని చూసుకుంటాడు. భార్య మాట వినని వ్యక్తి కూడా కుమార్తె మాట వింటాడు. తండ్రిపై బిడ్డకు ఉండే మమకారం, ప్రేమ అలాంటిది. ఇక తండ్రి మీద ఉండే అభిమానంతో ఆయన కోసం ఎలాంటి త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉండే ఆడబిడ్డలు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ ఆడబిడ్డ.. తండ్రి కోసం ఇలానే ఓ సాహసం చేసింది.. కానీ ఇలాంటి ఫలితం వస్తుందని ఆ తండ్రీ కూతుళ్ళిద్దరూ ఊహించలేదు. దాంతో వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇంతకు ఏం జరిగింది అంటే..

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడేందుకు బాలిక చేసిన సాహసం వారి ఇంట తీరని విషాదాన్ని నింపింది. ములుగు జిల్లా, మంగపేట (మం) కమలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి తండ్రి, కుమార్తెలిద్దరూ ఎండలకు తాళలేక సరదాగా గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. ఈత కొడుతుండగా.. తండ్రి నదిలో మునిగి పోసాగాడు. అది గమనించిన బాలిక నిఖిత (14) .. తండ్రిని కాపాడాలనే ఉద్దేశంతో.. ఆయనకి చెయ్యి అందించబోయింది. అయితే తండ్రిని కాపాడాలనుకునే ప్రయత్నంలో.. నిఖిత ప్రమాదశాత్తు గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఇక నిఖిత తండ్రి రాజేందర్ మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు.

తనను కాపాడబోయి.. బిడ్డ ప్రాణాలు వదలడం చూసి తండ్రి రాజేందర్‌.. షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ దుర్ఘటన గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్లముందే కూతురు చనిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈత సరదా.. తన ఇంట ఇలాంటి విషాదం నింపుతుందని ఆ తండ్రీ కూతుళ్ళిద్దరూ ఏమాత్రం ఊహించలేకపోయారు.

ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. వడగాడ్పుల వల్ల తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామాల్లో ఉన్న వారు.. వేసవి తాపం నుంచి తప్పించుకోవడం కోసం సరదాగా ఈత కొట్టడానికి నదులు, చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు ఇలా అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుని.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇక తాజాగా ఘటనలో కూడా తండ్రీ కూతుళ్ళిద్దరూ స్నానానికి వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక నిఖిత మృతితో గ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి