Nidhan
ఈసారి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ఎంఐకి మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. అయితే హిట్‌మ్యాన్‌కు ఓ టార్గెట్ ఉందని ఎవరికీ తెలియదు.
ఈసారి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ఎంఐకి మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. అయితే హిట్‌మ్యాన్‌కు ఓ టార్గెట్ ఉందని ఎవరికీ తెలియదు.
Nidhan
ఈసారి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ఎంఐకి మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక దాంట్లో మాత్రమే అతను ఫెయిలయ్యాడు. మిగతా నాలుగింట్లో చెలరేగిపోయాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్‌కు దిగుతున్నాడు రోహిత్. బౌలర్ ఎవరు? పిచ్ ఎలా బిహేవ్ చేస్తోంది? అనేది పట్టించుకోకుండా వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. టెక్నిక్‌తో పాటు కండబలంతో బలంగా షాట్లు బాదుతున్నాడు హిట్‌మ్యాన్. దీంతో అతడ్ని ఎలా ఆపాలో తెలియక అపోజిషన్ టీమ్ బౌలర్లు గుడ్లు తేలేస్తున్నారు. రోహిత్ పెర్ఫార్మెన్స్ మీద ముంబై జట్టుతో పాటు అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే హిట్‌మ్యాన్‌కు ఓ కొత్త టార్గెట్ ఉందని ఎవరికీ తెలియదు.
ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడ్డ ముంబై దాని నుంచి తేరుకొని వరుసగా రెండు విజయాలు సాధించింది. ఈ రెండు మ్యాచుల్లోనూ రోహిత్ రాణించాడు. ఇలా అతడు వరుసగా మంచి స్టార్ట్స్ అందిస్తుండటంతో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు ముంబై మేనేజ్మెంట్ హ్యాపీగా ఉంది. టీమ్ గెలుపులో అతడి కాంట్రిబ్యూషన్స్ కీలకంగా మారాయి. అటు బ్యాట్‌తో విజృంభిస్తూనే బౌలింగ్ టైమ్‌లో హార్దిక్‌కు సూచనలు ఇస్తూ కీలకపాత్ర పోషిస్తున్నాడు రోహిత్. ఫీల్డింగ్ పొజిషన్స్, బౌలింగ్ ఛేంజెస్ విషయంలో ఏ టైమ్‌కు ఎలా వ్యవహరించాలనేది పాండ్యాకు నేర్పుతూ ముంబైకి ఆయువుపట్టుగా మారాడు. అయితే రోహిత్ ఓ టార్గెట్‌తో ఆడుతున్నాడనేది ఎవరికీ తెలియదు. హిట్‌మ్యాన్ ఇప్పుడు పీక్ ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతడి స్కోర్లు.. 121 నాటౌట్, 43, 26, 0, 49, 38గా ఉన్నాయి. అందరూ ముంబై ఇండియన్స్‌కు కప్పు అందించాలనే కసితోనే అతడు ఇలా ఆడుతున్నాడని అనుకుంటున్నారు. కానీ హిట్‌మ్యాన్‌కు సెపరేట్ మిషన్ ఉంది.
ముంబై యాజమాన్యం, కొత్త కెప్టెన్ హార్దిక్ సహా ఎవ్వరికీ రోహిత్ నయా టార్గెట్ గురించి తెలియదు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన బాధ ఇంకా అతడ్ని వెంటాడుతోంది. ఆ పెయిన్ నుంచి బయటపడాలంటే ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను నెగ్గడమే మార్గం. అందుకే ఇంత జోరు మీద ఉన్నాడు హిట్‌మ్యాన్. ఆల్రెడీ ముంబైకి 5 కప్పులు అందించాడతను. కాబట్టి ఐపీఎల్ టైటిల్ అతడికి పెద్ద మ్యాటర్ కాదు. కెరీర్ ఆఖర్లో ఉన్నాడు కాబట్టి వరల్డ్ కప్ అందుకోవాలనే డ్రీమ్‌తో మరింత కసితో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రపంచ కప్‌లోనూ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. మరి.. రోహిత్ కొత్త టార్గెట్‌ను అందుకుంటాడని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.