iDreamPost

Virat Kohli: వీడియో: కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమానిపై దాడి! గ్రౌండ్‌లోనే చావగొట్టేశారు!

ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కాళ్లు మెుక్కాడు ఓ ఫ్యాన్. అతడిని గ్రౌండ్ వెలుపలికి తీసుకెళ్లిన సెక్యూరిటీ గార్డ్స్ విచక్షణారహితంగా కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కాళ్లు మెుక్కాడు ఓ ఫ్యాన్. అతడిని గ్రౌండ్ వెలుపలికి తీసుకెళ్లిన సెక్యూరిటీ గార్డ్స్ విచక్షణారహితంగా కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Virat Kohli: వీడియో: కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమానిపై దాడి! గ్రౌండ్‌లోనే చావగొట్టేశారు!

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా మార్చి 25( సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ పోరులో 4 వికెట్ల తేడాతో పంజాబ్ ను ఓడించింది ఆర్సీబీ. అయితే ఈ మ్యాచ్ గురించి అందరూ మర్చిపోయారు. కానీ ఆలస్యంగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు గ్రౌండ్ లోకి దూసుకొచ్చి, కాళ్లపై పడ్డాడు. ఇక్కడి వరకే చాలా మందికి తెలిసింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

ఆర్సీబీ-పంజాబ్ జట్ల మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ ఫ్యాన్ సెక్యూరిటీని ఛేదించుకుని వచ్చి.. కోహ్లీ కాళ్లు మెుక్కాడు. అయితే విరాట్ అతడిని ఏం అనలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడి వరకే చాలా మందికి తెలిసింది. కానీ తాజాగా అతడిని తీసుకెళ్లిన తర్వాత ఏం చేశారో తెలిస్తే షాకౌతారు. గ్రౌండ్ బయటకు పట్టుకొచ్చిన ఫ్యాన్ పై విచక్షణారహితంగా దాడిచేశారు సెక్యూరిటీ గార్డ్స్. అతడిపై పిడి గుద్దులు కురిపిస్తూ.. కాళ్లతో తన్నారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కుర్రాడు కిందపడిపోయాడు. చివరికి దండం కూడా పెట్టాడు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. కొందరు పాపం అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ అంటే పిచ్చితోనే ఆ ఫ్యాన్ ఇలా చేశాడని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలాంటి ఘటనలు క్రికెట్ చరిత్రలో చాలానే జరిగాయి. కానీ వారిపై ఇలా విచక్షణారహితంగా దాడి మాత్రం చేయలేదు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పరిపరి విధాలుగా స్పందిస్తున్నారు. సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కొందరు అంటుంటే.. విరాట్ ను అభిమానించడమే తప్పా? దానికే ఇలా కొట్టాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు అతడిని కొట్టడానికి మీకు హక్కు ఎక్కడిది? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం తప్పు అని రాసుకొస్తున్నారు. మరి కోహ్లీ కాళ్లు మెుక్కిన ఫ్యాన్ పై ఇలా దాడి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: రెండు మ్యాచ్ ల్లో ధోని బ్యాటింగ్ చేయకపోవడానికి కారణం అదే: CSK కోచ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి