Nidhan
ఆర్సీబీ జట్టు ఒక్కసారిగా ఫామ్ అందుకుంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ క్వాలిఫై అవ్వాలంటే ఇంకా ఒక్క పని చేయాల్సి ఉంది.
ఆర్సీబీ జట్టు ఒక్కసారిగా ఫామ్ అందుకుంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ క్వాలిఫై అవ్వాలంటే ఇంకా ఒక్క పని చేయాల్సి ఉంది.
Nidhan
ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. వరల్డ్ బెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహా ఎందరో స్టార్ ప్లేయర్లు ఆ టీమ్‌లో ఉండటంతో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే జట్టు నిండా స్టార్లు ఉన్నా రాత మాత్రం మారడం లేదు. ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్‌లతో దుమ్మురేపినా టీమ్‌కు టైటిల్‌ను అందించలేకపోయాడు కోహ్లీ. ఛాంపియన్‌గా నిలవకపోయినా ఆర్సీబీని ఇష్టపడే వారి సంఖ్య తగ్గడం లేదు. ఈసారి కూడా జట్టు మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వరుసగా ఆరు పరాజయాలతో ఆ టీమ్ తుస్సుమంది. దీంతో డుప్లెసిస్ సేన పనైపోయిందని అంతా భావించారు. కానీ సడన్‌గా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది ఆర్సీబీ.
వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది ఆర్సీబీ. ఆ తర్వాత వారం గ్యాప్‌లో మరో రెండు విజయాలు అందుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంకో 38 బంతులు ఉండగానే గెలుపొందింది. హ్యాట్రిక్స్ సక్సెస్‌లు అందుకున్న డుప్లెసిస్ సేన తమ ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా 11 మ్యాచుల్లో ఏడు ఓటములు, నాలుగు విజయాలతో 8 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో నిలిచింది బెంగళూరు. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ముందు ఆ జట్టు ఒక పని చేయాలి. తాము ఆడే మిగతా మూడు మ్యాచుల్లోనూ ఆర్సీబీ నెగ్గాలి. అప్పుడు ఆ టీమ్ పాయింట్ల సంఖ్య 14కు చేరుతుంది. అదే సమయంలో మరో మ్యాజిక్ కూడా జరగాలి.
ఆర్సీబీ నెక్స్ట్ ఆడే అన్ని మ్యాచుల్లోనూ నెగ్గాలి. అదే టైమ్‌లో సన్‌రైజర్స్, లక్నో సూపర్ జియాంట్స్ ఇక మీదట ఆడే మ్యాచుల్లో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధించొద్దని కోరుకోవాలి. ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ ఆడిన 10 మ్యాచుల్లో 6 విజయాలతో చెరో 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్‌కు దగ్గర్లో ఉన్నాయి. ఆ టీమ్స్ తర్వాతి ఆడే మ్యాచుల్లో ఒక్కదాంట్లో నెగ్గి, మిగతా వాటిల్లో ఓడితే 14 పాయింట్లతో ఉంటాయి. ఆర్సీబీ నెక్స్ట్ ఆడే మూడు మ్యాచుల్లోనూ గెలిస్తే కూడా 14 పాయింట్లతో ఉంటుంది. అప్పుడు డుప్లెసిస్ సేనకు ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి. నెట్ రన్‌రేట్‌ను బట్టి క్వాలిఫై అవకాశాలు ఉంటాయి. ఇక, 10 మ్యాచుల్లో 5 గెలుపులతో సీఎస్కే 10 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ఆ జట్టు తదుపరి నాలుగు మ్యాచుల్లో రెండింట్లోనే నెగ్గి మిగతావి ఓడిపోవాలని ఆర్సీబీ కోరుకోవాలి. అప్పుడు కూడా ఆర్సీబీకి ఛాన్సులు ఉంటాయి. మొత్తానికి ప్లేఆఫ్స్ వెళ్లాలంటే తాము ఆడే అన్ని మ్యాచుల్లో నెగ్గడంతో పాటు ఎస్ఆర్హెచ్, సీఎస్కే, లక్నో ఓడిపోవాలని ఆ జట్టు కోరుకోవాలి. మరి.. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.