Nidhan
ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓటములకు బ్రేక్ పడటం లేదు. వరుస పరాజయలతో ఆ టీమ్ పాయింట్స్ టేబుల్లో ఆఖరి ప్లేస్‌కు పడిపోయింది. స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ ఫెయిల్యూర్ బెంగళూరును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓటములకు బ్రేక్ పడటం లేదు. వరుస పరాజయలతో ఆ టీమ్ పాయింట్స్ టేబుల్లో ఆఖరి ప్లేస్‌కు పడిపోయింది. స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ ఫెయిల్యూర్ బెంగళూరును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
Nidhan
రూ.14 కోట్లు పెట్టి ఏరి కోరి కొనుక్కున్నారు. ఇతర జట్లతో ఎంత పోటీ ఎదురైనా తగ్గకుండా వేలంలో అతడ్ని సొంతం చేసుకున్నారు. టీమ్‌కు అతడు కప్ అందిస్తాడని ఎంతో నమ్మారు. 16 సీజన్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్ ఆశను ఈసారి నెరవేరుస్తాడని భావించారు. జట్టులోని ఇతర ఆటగాళ్ల అండతో మ్యాజిక్ చేస్తాడని అనుకున్నారు. కానీ అతడు ఆశలన్నీ ఆవిరి చేశాడు. ఫ్రాంచైజీతో పాటు కోట్లాది మంది అభిమానుల కలల్ని కల్లలు చేశాడు. మ్యాచ్‌లు గెలిపించడం మాట దేవుడెరుగు.. ఓటములకు అతడే ప్రధాన కారణం అవుతున్నాడు. బ్యాట్ పట్టుకోవడమే రాదన్నట్లు ఆడుతున్నాడు. అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నాడు. కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరుస్తున్న ఆ స్టార్ ప్లేయర్ మరెవరో కాదు.. గ్లెన్ మాక్స్వెల్. ఆర్సీబీ పాలిట విలన్‌గా మారిన ఈ హార్డ్ హిట్టర్ పరార్ అయ్యాడని వినిపిస్తోంది.
కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్) త్రయంలో ఒకడిగా ఉన్నాడు మాక్సీ. ఈ త్రయం తమను గెలిపిస్తుందని, కప్పు ఆశ తీరుస్తుందని ఆర్సీబీ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లు ఆడుతూ విరాట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. టీమ్ గెలవకపోయినా తన ఆటతీరుతో అందరి మనసుల్ని అతడు దోచుకుంటున్నాడు. డుప్లెసిస్ బ్యాట్‌తో ఫర్వాలేదనిపిస్తున్నా, కెప్టెన్సీలో జట్టు విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ త్రయంలోని చివరివాడైన మాక్స్వెల్ అందర్నీ నిరాశపరుస్తున్నాడు. గత ఆరు మ్యాచుల్లో అతడి బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు 32 మాత్రమే. ఈ ఐపీఎల్లో అతడి స్కోర్లు 0, 3, 28, 0, 1, 0 ఇలా ఉన్నాయి. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు డకౌట్ అయ్యాడు మాక్స్వెల్. రెండు సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. ఇది బెంగళూరు బ్యాటింగ్‌పై, విజయావకాశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
మాక్సీ ఫెయిల్యూర్ వల్ల ఇతర బ్యాటర్ల మీద ఒత్తిడి పెరిగి.. టీమ్ స్కోరు మీద ఎఫెక్ట్ పడుతోంది. ఈ తరుణంలో అతడి గాయం వార్త బయటకు వచ్చింది. బొటనవేలి నొప్పితో బాధపడుతున్న మాక్సీ.. తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. దీనిపై ఆర్సీబీ అభిమానులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మాక్సీ దూరమైంది రెండు టీ20లకే అయినా అతడు ఆడలేకపోతున్నాడు, పరార్ అయ్యాడంటూ సెటైర్లు వేస్తున్నారు. లాస్ట్ ఆరు ఇన్నింగ్స్‌లో అతడి ప్రదర్శన చూసి ఈ విధంగా అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. అతడు టోర్నీ నుంచి తప్పుకున్నా ఏం కాదని అంటున్నారు. అయితే నిజానికి మాక్సీ పూర్తిగా దూరం కాలేదు. ఇంజ్యురీ నుంచి కోలుకోగానే అతడు టీమ్‌లోకి వచ్చేస్తాడు. ఏదేమైనా మాక్స్వెల్ బ్యాటింగ్‌పై అభిమానులు సీరియస్‌గా ఉన్న మాట వాస్తవం. ఆస్ట్రేలియా తరఫున ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో కూడా అదరగొట్టిన ప్లేయర్.. ఇప్పుడు ఐపీఎల్లో దారుణంగా ఫెయిలవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. మరి.. మాక్సీ పెర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.