iDreamPost

Rishabh Pant: పంత్ అరుదైన రికార్డు.. కోహ్లీ సరసన చేరిన DC కెప్టెన్!

  • Published Apr 13, 2024 | 1:21 PMUpdated Apr 13, 2024 | 1:21 PM

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఏకంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సరసన అతడు నిలిచాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఏకంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సరసన అతడు నిలిచాడు.

  • Published Apr 13, 2024 | 1:21 PMUpdated Apr 13, 2024 | 1:21 PM
Rishabh Pant: పంత్ అరుదైన రికార్డు.. కోహ్లీ సరసన చేరిన DC కెప్టెన్!

కారు ప్రమాదం కారణంగా రెండేళ్ల పాటు క్రికెట్​కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో అతడి బ్యాట్ ఓ రేంజ్​లో గర్జిస్తోంది. బ్యాటింగే కాదు.. కీపింగ్​లోనూ తన తడాఖా చూపిస్తున్నాడు పంత్. మెరుపు వేగంతో స్టంపింగ్స్ చేస్తూ, డైవింగ్ క్యాచ్​లు పడుతూ తనలో పస ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తున్నాడు. వికెట్ల మధ్య ఫాస్ట్​గా పరిగెడుతూ తన ఫిట్​నెస్ లెవల్స్ ఎంత బాగున్నాయో చూపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్​గా ఉన్న పంత్ టీమ్ విజయం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. వరుస పరాజయాలతో డీలాపడ్డ ఆ జట్టు ఎట్టకేలకు సక్సెస్ బాట పట్టింది. హ్యాట్రిక్ విక్టరీస్​తో ఫుల్ జోష్​లో ఉన్న లక్నో సూపర్ జియాంట్స్​ను కంగుతినిపించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్ ఓ అరుదైన రికార్డును సాధించాడు.

లక్నోతో మ్యాచ్​లో బ్యాట్​తో చెలరేగిన పంత్ 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 4 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. మార్కస్ స్టొయినిస్ బౌలింగ్​లో అతడు కొట్టిన రివర్స్ స్వీప్ మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది. ఈ మ్యాచ్ ద్వారా పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో (2028) 3 వేల పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా రికార్డు నెలకొల్పాడు. అతడి తర్వాతి స్థానాల్లో యూసుఫ్​ పఠాన్ (2062) ఉన్నాడు. థర్డ్ ప్లేస్​లో సూర్యకుమార్ యాదవ్ (2130) ఉన్నాడు. అతి పిన్న వయసులో 3000 రన్స్ చేసిన ఆటగాళ్లలో రిషబ్ (26 ఏళ్ల 191 రోజులు) మూడో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు శుబ్​మన్ గిల్ (24 ఏళ్ల 215 రోజులు), విరాట్ కోహ్లీ (26 ఏళ్ల 186 రోజులు) ఈ ఫీట్​ను సాధించారు.

లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్​ఎస్​జీ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన పంత్ సేన.. 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. పంత్​తో పాటు జేక్ ఫ్రేజర్ మెక్​గర్క్ (35 బంతుల్లో 55) కూడా చెలరేగిపోయాడు. వీళ్లిద్దరూ ఎల్​ఎస్​జీ బౌలర్లకు చుక్కలు చూపించారు. పంత్-ఫ్రేజర్ కలసి 7 సిక్సర్లు బాదారు. ఆఖర్లో వీళ్లిద్దరూ ఔటైనా ట్రిస్టన్ స్టబ్స్ (15 నాటౌట్), షై హోప్ (11 నాటౌట్) కలసి టీమ్​ను విజయతీరాలకు చేర్చారు. మరి.. కమ్​బ్యాక్​లో పంత్ రాణిస్తున్న తీరు మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి