iDreamPost
android-app
ios-app

IPL 2024: ముంబై ఇండియన్స్​కు భారీ షాక్.. మ్యాచ్ విన్నర్ దూరం!

  • Published Jan 08, 2024 | 12:37 PM Updated Updated Jan 08, 2024 | 8:10 PM

పాపులర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్​కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్​కు ఒక మ్యాచ్ విన్నర్ దూరమయ్యాడు.

పాపులర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్​కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్​కు ఒక మ్యాచ్ విన్నర్ దూరమయ్యాడు.

  • Published Jan 08, 2024 | 12:37 PMUpdated Jan 08, 2024 | 8:10 PM
IPL 2024: ముంబై ఇండియన్స్​కు భారీ షాక్.. మ్యాచ్ విన్నర్ దూరం!

ముంబై ఇండియన్స్​.. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లోని టాప్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఐదుసార్లు ట్రోఫీ ఎగరేసుకుపోయిన ఈ టీమ్ మీద ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్లే ముంబై కూడా సత్తా చాటుతూ వస్తోంది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కెప్టెన్​గా ఉండటం.. సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ లాంటి టీమిండియా ప్లేయర్లు జట్టులో ఉండటంతో ముంబైకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఎంఐకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఫ్రాంచైజీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తొలగించడం, గుజరాత్​ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. అయితే గాయంతో బాధపడుతున్న హార్దిక్ ఇంకా కోలుకోకపోవడంతో ఎంఐ టెన్షన్​లో ఉంది. ఈ తరుణంలో ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది.

చీలమండ గాయం కారణంగా బాధపడుతున్న ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్​ ఇంకొన్నాళ్ల పాటు క్రికెట్​కు దూరం కానున్నాడు. ఈ మిస్టర్ 360 ప్లేయర్​ను మరో హెల్త్ ఇష్యూ కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ హెర్నియా వల్ల సూర్యకుమార్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ డాషింగ్ బ్యాట్స్​మన్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడు. మరో మూడ్రోజుల్లో సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్​కు అతడు పయనమవుతాడు. కాబట్టి రంజీ ట్రోఫీ-2024తో పాటు ఐపీఎల్-2024 స్టార్టింగ్​ మ్యాచులకు సూర్య దూరంగా ఉంటాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా చీలమండ నొప్పితో గేమ్​కు దూరంగా ఉన్నాడు. అతడు ఎప్పుడు ముంబై ఇండియన్స్​తో చేరతాడనే దానిపై క్లారిటీ లేదు.

Big shock for MI

హార్దిక్ విషయంలో క్లారిటీ రాకపోగా.. ఇప్పుడు సూర్య కూడా దూరమవడంతో ఇద్దరు కీలక ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్స్ లేకుండా ఎంఐ వచ్చే ఐపీఎల్​ సీజన్​ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య పూర్తిగా కోలుకునేందుకు 8 నుంచి 9 వారాలు పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ ఉంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్​ను భారత్ తృటిలో మిస్సయింది. ఫైనల్ వరకు వచ్చి ట్రోఫీని చేజార్చుకుంది. కాబట్టి ఈసారి ప్రపంచ కప్​ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దని టీమిండియా భావిస్తోంది. అందుకోసం ఐపీఎల్​ను పక్కనపెట్టి పూర్తిగా కోలుకునేందుకు సూర్యకు మరింత రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో బీసీసీఐ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. మరి.. సూర్య రూపంలో ముంబైకి బిగ్ షాక్ తగలడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఓవరాక్షన్ స్టార్ ఇది టెస్ట్ అని మరిచావా? ఆ కొట్టుడేంది? రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం!