iDreamPost

Riyan Parag: ఓవరాక్షన్ స్టార్ ఇది టెస్ట్ అని మరిచావా? ఆ కొట్టుడేంది? రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం!

రియాన్ పరాగ్.. రంజీ ట్రోఫీ 2024 లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అతడు ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్ అని మరిచాడా? అన్నంతగా చెలరేగాడు ఈ ఓవరాక్షన్ స్టార్.

రియాన్ పరాగ్.. రంజీ ట్రోఫీ 2024 లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అతడు ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్ అని మరిచాడా? అన్నంతగా చెలరేగాడు ఈ ఓవరాక్షన్ స్టార్.

Riyan Parag: ఓవరాక్షన్ స్టార్ ఇది టెస్ట్ అని మరిచావా? ఆ కొట్టుడేంది? రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం!

రియాన్ పరాగ్.. తన ఆటతీరు కంటే,యాటిట్యూడ్ తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. దీంతో పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఈ యంగ్ ప్లేయర్. అయితే ఈ విమర్శలు అతడిపై తీవ్ర ప్రభావం చూపినట్లున్నాయి. అందుకే ఓవరాక్షన్ కు దూరంగా ఉంటూ.. తన గేమ్ ను మార్చుకున్నాడు పరాగ్. అప్పటి నుంచి బ్యాటింగ్ లో దుమ్మురేపుతూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. తాజాగా ప్రారంభమైన రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో అస్సాం జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు పరాగ్. ఇక ఈ సీజన్ లో భాగంగా చత్తీస్ ఘడ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు ఈ ఓవరాక్షన్ స్టార్. అతడి ఆట కొనసాగించిన విధానం చూస్తే.. ఇది టెస్ట్ మ్యాచ్ అని బహుశా మరిచిపోయాడా? అన్న అనుమానం కలగకమానదు.

ఓవరాక్షన్ స్టార్.. క్రికెట్ లో పేరు వినపడగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే ఆటగాడు రియాన్ పరాగ్. గ్రౌండ్ లో బ్యాటింగ్ తో కంటే.. తన చేష్టలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు ఈ ఆటగాడు. అయితే గత కొద్దికాలం నుంచి అతడి ఆటతీరులో అనూహ్య మార్పులు వచ్చాయి. ఓవరాక్షన్ తగ్గించి,అద్భుతమైన ఆటతీరుతో ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. తాజాగా ప్రారంభమైన రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో చత్తీస్ ఘడ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు పరాగ్. అస్సాం జట్టుకు కెప్టెన్ గా వ్యవహారిస్తున్న పరాగ్.. సిక్స్ లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. ఆడేది టెస్ట్ మ్యాచా? లేక టీ20నా? అన్న రేంజ్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

priyan parag superb batting

ఈ క్రమంలోనే కేవలం 56 బంతుల్లోనే శతకం సాధించి.. ఔరా అనిపించాడు రియాన్ పరాగ్. ఒకవైపు వికెట్లు పడుతున్నా, తను మాత్రం రెచ్చిపోయి ఆడాడు. కేవలం 87 బంతుల్లోనే 12 భారీ సిక్స్ లు, 11 ఫోర్లతో 155 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో అస్సాం స్వల్ప ఆధిక్యం దిశగా వెళ్తోంది. 180 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి.. తన సత్తా ఏంటో చూపించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే చత్తీస్ ఘడ్ తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. అస్సాం తొలి ఇన్నింగ్స్ లో 159 రన్స్ కే కుప్పకూలి, ఫాలో ఆన్ ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో 254 రన్స్ కు ఆలౌట్ అయ్యి.. 86 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.  మరి ఈ మ్యాచ్ లో టీ20 తరహా ఇన్నింగ్స్ తో చెలరేగిన పరాగ్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి