iDreamPost

MI vs KKR: రోహిత్ శర్మకు ఘోర అవమానం! హార్దిక్‌ పాండ్యా కావాలనే ఇలా చేస్తున్నాడా?

  • Published May 03, 2024 | 8:32 PMUpdated May 04, 2024 | 7:59 AM

ముంబై ఇండియన్స్​కు 5 కప్పులు అందించిన రోహిత్ శర్మకు దారుణమైన అవమానం జరిగింది. దీన్ని సహించని అతడి అభిమానులు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద ఫైర్ అవుతున్నారు.

ముంబై ఇండియన్స్​కు 5 కప్పులు అందించిన రోహిత్ శర్మకు దారుణమైన అవమానం జరిగింది. దీన్ని సహించని అతడి అభిమానులు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద ఫైర్ అవుతున్నారు.

  • Published May 03, 2024 | 8:32 PMUpdated May 04, 2024 | 7:59 AM
MI vs KKR: రోహిత్ శర్మకు ఘోర అవమానం! హార్దిక్‌ పాండ్యా కావాలనే ఇలా చేస్తున్నాడా?

రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్​కు 5 కప్పులు అందించిన గ్రేట్ కెప్టెన్. సారథిగా సక్సెస్ అవడమే కాదు.. బ్యాట్స్​మన్​గానూ ఆ జట్టు తరఫున పరుగుల వరద పారించాడు. ముంబై ఆటగాళ్లకు ఓ జట్టులా ఆడటాన్ని అతడే నేర్పించాడు. ఆ టీమ్​ను బిల్డ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. జస్​ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి అనామక ఆటగాళ్లను స్టార్లుగా తీర్చిదిద్దింది అతడే. ఫెయిలైనా సరే పట్టుబట్టి వాళ్లకు ఛాన్సులు ఇచ్చి ప్రోత్సహించాడు. ఐపీఎల్​లో ముంబై ఫ్రాంచైజీకి హ్యూజ్ ఫ్యాన్ బేస్​ ఏర్పడటంలోనూ హిట్​మ్యాన్​దే కీలక పాత్ర. అయితే అలాంటోడికి ఈ సీజన్ మొదలవ్వక ముందు నుంచే అవమానాలు స్టార్ట్ అయ్యాయి. ఐపీఎల్​-2024 ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తీసేసి రోహిత్​ను అవమానించింది ముంబై యాజమాన్యం.

కెప్టెన్సీ పోయినా ముంబైకి ఆడుతున్నాడు రోహిత్. తోటి ఆటగాళ్లతో కలసిపోయి జట్టు విజయం కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. అలాంటోడ్ని మరోమారు అవమానించారు. కోల్​కతా నైట్ రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో హిట్​మ్యాన్​ను ఇంప్యాక్ట్ ప్లేయర్​గా ప్రకటించింది ముంబై జట్టు. రోహిత్​కు ఎలాంటి గాయం లేదు. అతడు పూర్తి ఫిట్​గా ఉన్నాడు. బ్యాటింగ్​ టైమ్​లో క్రీజులో వేగంగా పరుగులు తీస్తున్నాడు. ఫీల్డింగ్ సమయంలోనూ 30 యార్డ్ సర్కిల్​తో పాటు బౌండరీ లైన్ వద్ద కూడా చురుగ్గా ఉంటున్నాడు. గాయం లేదు, ఫిట్​గా ఉన్నాడు అయినా అతడ్ని ఇంప్యాక్ట్ ప్లేయర్​గా ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు టీమ్ మేనేజ్​మెంట్​ మీద సీరియస్ అవుతున్నారు.

రోహిత్​ను అవమానిస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఏ గాయం లేకున్నా కావాలనే ఇంప్యాక్ట్ ప్లేయర్​గా తీసుకున్నారని సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు ఇంప్యాక్ట్​​గా తీసుకున్నారు, ఆ తర్వాత క్రమంగా టీమ్​లో నుంచి తీసేస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ గ్రౌండ్​లో ఉంటే హార్దిక్​కు ఫీల్డింగ్ పొజిషన్స్, బౌలింగ్ ఛేంజెస్ గురించి సలహాలు ఇచ్చేవాడని.. కానీ అవేవీ అతడికి వద్దని, అందుకే డగౌట్​లో కూర్చోబెడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఓన్లీ బ్యాటర్​గా తీసుకొని ఫీల్డింగ్ టైమ్​లో తన డామినేషన్ చూపించాలనేది పాండ్యా ప్లాన్ అని అంటున్నారు. హిట్​మ్యాన్​ బ్యాటర్​గా ఫెయిలైతే టీమ్​లో నుంచి పూర్తిగా తీసేయాలనేది అతడి స్కెచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్​ను ఇంప్యాక్ట్ ప్లేయర్​గా ఆడించడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి