iDreamPost

MI vs CSK: హార్దిక్, రోహిత్​తో ధోని మైండ్​గేమ్.. అందుకే మాహీకి ఎవరూ సాటిలేరు అనేది!

  • Published Apr 15, 2024 | 8:41 PMUpdated Apr 15, 2024 | 8:41 PM

క్రికెట్​లో అత్యంత మేధావిగా లెజెండ్ ఎంఎస్ ధోనీని చెబుతుంటారు. అతడిది పర్ఫెక్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అని.. మాహీ ప్లాన్ వేస్తే అపోజిషన్ టీమ్​ అడ్రస్ గల్లంతేనని అంటుంటారు. ఇది మరోసారి ప్రూవ్ అయింది.

క్రికెట్​లో అత్యంత మేధావిగా లెజెండ్ ఎంఎస్ ధోనీని చెబుతుంటారు. అతడిది పర్ఫెక్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అని.. మాహీ ప్లాన్ వేస్తే అపోజిషన్ టీమ్​ అడ్రస్ గల్లంతేనని అంటుంటారు. ఇది మరోసారి ప్రూవ్ అయింది.

  • Published Apr 15, 2024 | 8:41 PMUpdated Apr 15, 2024 | 8:41 PM
MI vs CSK: హార్దిక్, రోహిత్​తో ధోని మైండ్​గేమ్.. అందుకే మాహీకి ఎవరూ సాటిలేరు అనేది!

క్రికెట్​లో అత్యంత మేధావిగా లెజెండ్ ఎంఎస్ ధోనీని చెబుతుంటారు. అతడిది పర్ఫెక్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అని.. మాహీ ప్లాన్ వేస్తే అపోజిషన్ టీమ్​ అడ్రస్ గల్లంతేనని అంటుంటారు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ వచ్చాయి. క్రికెట్ టీమ్ గేమ్ అనేది తెలిసిందే. జట్టులోని 11 మంది ఆటగాళ్లు కలసికట్టుగా ఆడితేనే విజయం సొంతమవుతుంది. అయితే వాళ్లను నడిపించే సారథి కూడా ఉండాలి. మ్యాచ్ సిచ్యువేషన్స్​ను బట్టి క్విక్ డెసిషన్స్ తీసుకునే సత్తా కెప్టెన్​కు ఉండాలి. ఆ బుర్ర ఉంది కాబట్టే మాహీ ఇంత సక్సెస్ అయ్యాడు. ఇంటర్నేషనల్ లెవల్​లో టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిన ధోని.. ఐపీఎల్​లో అదే చేస్తున్నాడు. సీఎస్​కేకు 5 కప్పులు అందించిన అతడు.. ఇప్పుడు కెప్టెన్సీకి దూరంగా ఉన్నా కొత్త సారథి రుతురాజ్​ గైక్వాడ్​ను వెనుక నుంచి గైడ్ చేస్తున్నాడు. అతడి మాస్టర్​మైండ్ వల్లే నిన్న ముంబైని చిత్తు చేసింది చెన్నై.

ధోనీని మాస్టర్​మైండ్ అని ఎందుకు అంటారో ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో మరోమారు ప్రూవ్ అయింది. నిన్నటి మ్యాచ్​లో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో ఆడుకున్నాడు మాహీ. మ్యాచ్ సిచ్యువేషన్​ను బట్టి ఎప్పటికప్పుడు ప్లాన్స్​ను మారుస్తూ పోయాడు. స్ట్రాటజీ విషయంలో హార్దిక్-రోహిత్ కంటే రుతురాజ్-ధోని జోడీ చాలా తెలివిగా వ్యవహరించింది. మ్యాచ్​లో గెలుపోటములను అదే డిసైడ్ చేసింది. సీఎస్​కే బ్యాటింగ్ టైమ్​తో పాటు ముంబై ఇన్నింగ్స్ సమయంలోనూ ఇది క్లియర్​గా కనిపించింది. చెన్నై పించ్ హిట్టర్ శివమ్ దూబె స్పిన్నర్లను ఊచకోత కోస్తాడనే విషయం అందరికీ తెలుసు. దీంతో అతడి కోసం స్పిన్నర్లను ఆపింది ముంబై. కానీ ఇది ముందే ఎక్స్​పెక్ట్ చేసింది సీఎస్​కే క్యాంప్. పేస్ వచ్చినా సరే బాదుడేనని అతడికి ముందే చెప్పి పంపాడు ధోని. దీంతో రెచ్చిపోయిన లెఫ్టాండ్ బ్యాటర్ 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అలా హార్దిక్ అండ్ రోహిత్​కు ఫస్ట్ దెబ్బ పడింది.

దూబె కోసం అందరు ఫాస్ట్ బౌలర్లను వాడేశాడు హార్దిక్. ఆఖరికి ప్రధాన అస్త్రమైన బుమ్రాను కూడా యూజ్ చేశాడు. దీంతో అతడికి ఆఖర్లో ఓవర్స్​ లేకుండా పోయాయి. దీని వల్ల లాస్ట్ ఓవర్ వేసేందుకు పాండ్యా వచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న ధోని అతడ్ని ఉతికి ఆరేశాడు. ఇలా రెండో దెబ్బ కొట్టాడు మాహీ. ఛేజింగ్ టైమ్​లో రోహిత్ శర్మ మంచి ఊపు మీదున్నాడు. అతడ్ని ఆపడం కష్టమని భావించిన ధోని.. రుతురాజ్​తో కలసి కొత్త వ్యూహం పన్నాడు. హిట్​మ్యాన్​ మూమెంటమ్ దెబ్బ తీసేందుకు అతడి మీద కాకుండా ఇతర బ్యాటర్లను టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేయించాడు. ఇది వర్కౌట్ అయింది.

తిలక్​తో కలసి మ్యాచ్​ను ఫినిష్ చేద్దామని రోహిత్ అనుకున్నాడు. కానీ పతిరానాను దింపి అతడి పనిపట్టారు. అక్కడి నుంచి హిట్​మ్యాన్​ బ్యాటింగ్ ఫ్లో దెబ్బతింది. ఇది మూడో దెబ్బ. హార్దిక్​ను బౌలింగ్​ టైమ్​లో​ ధోని బాదేయడంతో అతడు ఒత్తిడికి లోనయ్యాడు. ఫామ్​లో లేకున్నా బ్యాటింగ్​కు వచ్చాడు. మ్యాచ్​ను ఫినిష్ చేసి హీరో అవుదామని భావించాడు. ఈ సీజన్​లో తన కంటే బాగా బ్యాటింగ్ చేస్తున్న టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్​ను కాదని స్వయంగా హార్దికే బ్యాటింగ్​కు వచ్చాడు. అతడు 6 బంతుల్లో 2 పరుగులే చేయడంతో టీమ్​పై మరింత ప్రెజర్ పడి ఓడిపోయింది. ఇది లాస్ట్ పంచ్. ఇలా పకడ్బందీ వ్యూహాలతో పాండ్యా-రోహిత్ జోడీని నిలువరించి సీఎస్​కేకు మరో విజయాన్ని కట్టబెట్టాడు మాహీ. మరి.. ధోని స్ట్రాటజీల మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి