iDreamPost
android-app
ios-app

హార్దిక్ పాండ్యా కోసం MI ఎంత ఖర్చు పెట్టిందో రివీల్ చేసిన అశ్విన్!

  • Author singhj Published - 09:53 PM, Wed - 29 November 23

ఐపీఎల్​లో ఫ్రాంచైజీ మారిన హార్దిక్ పాండ్యా అందుకు ఎంత మొత్తం అందుకున్నాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్​గా మారింది. దీనిపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.

ఐపీఎల్​లో ఫ్రాంచైజీ మారిన హార్దిక్ పాండ్యా అందుకు ఎంత మొత్తం అందుకున్నాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్​గా మారింది. దీనిపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.

  • Author singhj Published - 09:53 PM, Wed - 29 November 23
హార్దిక్ పాండ్యా కోసం MI ఎంత ఖర్చు పెట్టిందో రివీల్ చేసిన అశ్విన్!

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 ఆక్షన్ నేపథ్యంలో పాండ్యా ఫ్రాంచైజీ మార్పు గురించి క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతూనే ఉంది. వేలానికి ముందు నిర్వహించే ఆటగాళ్ల రిటెన్షన్​లో అందరికంటే ఎక్కువగా హార్దికే హైలైట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్​కు కెప్టెన్​గా ఉన్న అతడు ముంబై ఇండియన్స్​కు మారుతున్నట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ గాసిప్స్​ను అటు ముంబై, గుజరాత్​లు.. ఇటు హార్దిక్ కూడా ఖండించకపోవడంతో ఇదే నిజమనే అభిప్రాయం బలపడింది. అందుకు తగ్గట్లే రిటెన్షన్​లో పాండ్యాను దక్కించుకుంది ముంబై ఇండియన్స్.

హార్దిక్​ను తీసుకునేందుకు అవసరమైన మేర డబ్బులు లేకపోవడంతో రూ.17 కోట్ల ఆటగాడు కామెరాన్ గ్రీన్​ను వదులుకుంది ముంబై. అతడ్ని రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇచ్చేసింది. ఈ డీల్ ద్వారా వచ్చిన డబ్బులను గుజరాత్​కు ఇచ్చి పాండ్యా విషయంలో అగ్రిమెంట్ చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మరో మూడ్నాలుగేళ్లకు మించి క్రికెట్​లో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పాండ్యాను ముంబై తెచ్చుకుందని.. అతడే నెక్స్ట్ కెప్టెన్ అని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అయితే అతడికి ఎంత మొత్తం ఇచ్చారనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

హార్దిక్ పాండ్యా​ను తమకు ఇచ్చేసిందుకు గుజరాత్ టైటాన్స్​కు ముంబై ఇండియన్స్ రూ.15 కోట్లు ముట్టజెప్పిందని టాక్. అయితే ఇదిగాక మరికొంత అదనపు మొత్తాన్ని గుజరాత్​కు ముంబై ఇవ్వనుందని సమాచారం. అందులో నుంచి సగం పాండ్యాకు కూడా ఇస్తారట. కానీ దీంట్లో ఎంత నిజం ఉందనేది మాత్రం తెలియరాలేదు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా అంశంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. ట్రేడింగ్ ద్వారా టీమ్ మారిన ప్లేయర్​కు అందే మొత్తం ఎంత ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్​ ఛానల్​ వేదికగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘ఐపీఎల్ ట్రేడ్ డీల్ అనేది ఎలా ఉంటుందో మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తా. గతంలో నేను కూడా ఇలా టీమ్ మారిన ఆటగాడ్నే. ట్రేడింగ్ టైమ్​లో ఒక ప్లేయర్ ఎంత మొత్తానికైతే మారుతున్నాడో అందులో 10 నుంచి 50 శాతం వరకు పొందుతాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి రూ.15 కోట్ల మేరకు ట్రేడ్ చేసుకున్నట్లు చెబుతోంది. ఇలాంటి సందర్భాల్లో క్రికెటర్​ను ఆయా ఫ్రాంచైజీలు తమ కమోడిటీగా భావిస్తాయి. తాము ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని చెల్లిస్తాయి. అదే సమయంలో అదనంగా ఇంకొంత మొత్తాన్ని కూడా ముట్టజెబుతాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ట్రేడింగ్ చేసుకున్న ఫ్రాంచైజీలు, ప్లేయర్లకు మధ్య ఉన్న అంతర్గత వ్యవహారం’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి.. పాండ్యాకు ముంబై అదనంగా ఎంత మొత్తం ఇచ్చిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బీసీసీఐ ఆఫర్​ను తిరస్కరించిన నెహ్రా! అహంకారంతో కాదు.. ఆలోచించే చేశాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి