Nidhan
ఐపీఎల్-2024ను ముంబై ఇండియన్స్ ఓటమితో స్టార్ట్ చేసింది. ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎంఐ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్-2024ను ముంబై ఇండియన్స్ ఓటమితో స్టార్ట్ చేసింది. ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎంఐ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
అలవోకగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్-2024ను ఆ టీమ్ ఓటమితో స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడ్డ హార్దిక్ సేన 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఎంఐ డామినేషన్ నడిచింది. కానీ కీలక సమయంలో ఒత్తిడికి గురైన ఆ టీమ్ టైటాన్స్‌ను పడగొట్టలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కానీ లోతుగా ఆలోచిస్తే ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అహ్మదాబాద్ పిచ్‌లో బాల్ బ్యాట్ మీదకు బాగా వస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తేమ ఉండటంతో ముంబైకి ఛేజింగ్ ఈజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ టీమ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (43), నమన్ ధిర్ (20) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కానీ వీళ్లిద్దరితో పాటు మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్న డెవాల్డ్ బ్రేవిస్ (46) కూడా మంచి స్టార్స్ అందుకున్నాక కీలక సమయాల్లో వెనుదిరిగారు. తిలక్ వర్మ (25) కూడా నిలబడాల్సిన టైమ్‌లో చేతులెత్తేశాడు. పించ్ హిట్టర్ టిమ్ డేవిడ్ (11), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11) కూడా మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయారు. బౌలింగ్‌లో అదరగొట్టిన ముంబై.. అదే జోరును బ్యాటింగ్‌లో కొనసాగిస్తే ఈజీగా నెగ్గేది. బ్యాటర్ల ఫెయిల్యూర్ ఆ టీమ్‌ను దెబ్బకొట్టింది.
ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో టోటల్ ఫెయిల్ అయ్యాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అతడు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అతడి వైఫల్యమే టీమ్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. బౌలింగ్‌లో బుమ్రా, కొయెట్జీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను చేతిలో పెట్టుకొని తానే మొదటి ఓవర్ వేశాడు. బుమ్రా, కొయెట్జీలు 5 వికెట్లు తీయగా.. పాండ్యా ఒక్క వికెట్ తీయకపోగా, 3 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చుకున్నాడు. పవర్‌ప్లేలో ఇష్టం వచ్చినట్లు ఎవరితో పడితే వారితో బౌలింగ్ వేయించాడు. ఫీల్డ్ పొజిషన్స్ కూడా సరిగ్గా లేవు. బ్యాటింగ్‌లో తన అవసరం ఉన్న టైమ్‌లో దిగకుండా.. టిమ్ డేవిడ్‌ను పంపాడు. రషీద్ ఖాన్‌ను హార్దిక్ ఎదుర్కొని పరుగులు చేస్తే ముంబై ఈజీగా నెగ్గేది. స్పిన్ ఆడటంలో వీక్ అయిన డేవిడ్‌ను పంపడం, తిలక్ కూడా రషీద్‌ను డీల్ చేయలేకపోవడంతో అనవసర ప్రెజర్ పెరిగి ఆ తర్వాత వికెట్లు టపటపా పడ్డాయి. ఆఖర్లో వచ్చిన పాండ్యా మ్యాచ్‌ను ముగిస్తాడనుకుంటే అదీ చేయలేదు.
ముంబై జట్టులో ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే బౌలింగ్‌లో బుమ్రా (3/14), కొయెట్జీ (2/27) రాణించారు. బ్యాటింగ్‌లో రోహిత్ (43), బ్రేవిస్ (46) బాగా ఆడారు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే ఎంఐలో టీమ్ ఎఫర్ట్ క్లియర్‌గా మిస్ అయింది. దానికి కెప్టెన్ హార్దిక్‌తో పాటు కోచ్ తప్పిదమే కనిపిస్తోంది. ఏ ప్లేయర్‌ను ఎప్పుడు బ్యాటింగ్‌కు దింపాలి? ఎవరితో ఎప్పుడు బౌలింగ్ చేయాలి? అనే స్ట్రాటజీ మిస్సయింది. బౌలింగ్‌లో పవర్‌ప్లేలోనే రెండు ఓవర్లు వేసిన పాండ్యా.. బ్యాటింగ్‌లో మాత్రం డౌన్ ది ఆర్డర్లో వచ్చాడు. రషీద్ బౌలింగ్‌లో ఆడేందుకు అతడు భయపడినట్లు స్పష్టంగా తేలిపోయింది. టిమ్ డేవిడ్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దింపడం మైనస్‌గా మారింది. బాగా ఆడుతున్న రోహిత్, బ్రేవిస్ జోడీని అలాగే కంటిన్యూ చేయమని సూచించాల్సింది. వాళ్లను అటాక్ చేయమనడంతో అనవసరంగా ఔట్ అయ్యారు. ఇలా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు బాగున్నా.. వాళ్లతో ఏం కావాలో అది చేయించుకోకపోవడం మైనస్‌గా మారింది. గుజరాత్ ప్లేయర్లలో కనిపించిన గెలవాలనే కసి, తపన ముంబై ఆటగాళ్లలో లోపించింది.
ఇదీ చదవండి: RR vs LSG: తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన సంజు శాంసన్! ఇది కదా రికార్డ్ అంటే..