iDreamPost
android-app
ios-app

వీడియో: హార్దిక్​ను కుక్కతో పోలుస్తూ ఫ్యాన్స్ అరుపులు.. ఇంతకంటే అవమానం ఉండదు!

  • Published Mar 25, 2024 | 11:41 AM Updated Updated Mar 25, 2024 | 11:41 AM

ఐపీఎల్-2024లో తొలి మ్యాచ్​లోనే ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. అతడ్ని రోహిత్ ఫ్యాన్స్ ఓ రేంజ్​లో ఆటాడుకున్నారు. కుక్కతో పోలుస్తూ అవమానించారు.

ఐపీఎల్-2024లో తొలి మ్యాచ్​లోనే ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. అతడ్ని రోహిత్ ఫ్యాన్స్ ఓ రేంజ్​లో ఆటాడుకున్నారు. కుక్కతో పోలుస్తూ అవమానించారు.

  • Published Mar 25, 2024 | 11:41 AMUpdated Mar 25, 2024 | 11:41 AM
వీడియో: హార్దిక్​ను కుక్కతో పోలుస్తూ ఫ్యాన్స్ అరుపులు.. ఇంతకంటే అవమానం ఉండదు!

కెప్టెన్సీ మార్పు అంశంతో ఈసారి ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​ ఎలా ఆడుతుంది? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అయితే ఫస్ట్ మ్యాచ్​లో ముంబై ఆటతీరు కంటే ఆ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాగా హైలైట్ అయ్యాడు. మాజీ సారథి రోహిత్ శర్మతో అతడు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో స్టేడియంలోనే హిట్​మ్యాన్ అభిమానులు పాండ్యాను ఓ రేంజ్​లో ఆటాడుకోవడం హాట్ టాపిక్​గా మారింది. జట్టుకు 5 ట్రోఫీలు అందించిన రోహిత్​ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తీసేయడంతో హిట్​మ్యాన్ ఫ్యాన్స్​తో పాటు చాలా మంది ముంబై అభిమానులు కోపంతో ఉన్నారు. దీంతో కొత్త కెప్టెన్ పాండ్యా దొరికితే వదలొద్దని డిసైడ్ అయ్యారు. గుజరాత్ టైటాన్స్​తో జరిగిన ఫస్ట్ మ్యాచ్​లో టాస్ దగ్గర నుంచి మ్యాచ్ ముగిసే వరకు హార్దిక్​ను ఫ్యాన్స్ ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు.

ముంబై, జీటీ మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన అహ్మదాబాద్​లో టాస్ టైమ్​లో ముంబై కెప్టెన్ హార్దిక్ అని చెప్పగానే ఫ్యాన్స్ గేలి చేయడం స్టార్ట్ చేశారు. ‘రోహిత్.. రోహిత్’ అంటూ గట్టిగా అరవసాగారు. మ్యాచ్ మొదలైన తర్వాత గ్రౌండ్​లోకి ఓ కుక్క వచ్చింది. దాని వల్ల మ్యాచ్​కు కాసేపు ఆటంకం కలిగింది. అయితే ఆ కుక్క కాస్తా హార్దిక్ దగ్గర నుంచి పోవడంతో హిట్​మ్యాన్ అభిమానులు దాన్ని చూస్తూ ‘హార్దిక్.. హార్దిక్’ అని బిగ్గరగా అరిచారు. కుక్కతో అతడ్ని పోలుస్తూ ట్రోల్ చేశారు. ‘బూ..’ అంటూ గేలి చేశారు. 30 యార్డ్ సర్కిల్​లో ఫీల్డింగ్ చేసే రోహిత్​ను కావాలని బౌండరీ లైన్ దగ్గరకు పంపాడు హార్దిక్. టీమ్​లో తన కంటే ఎవరూ తోపు లేరనే రీతిలో బిహేవ్ చేశాడు. దీంతో ఆవేశం తట్టుకోలేక మళ్లీ పాండ్యాను ఎగతాళి చేశారు ఫ్యాన్స్. ఇలా మ్యాచ్ మొత్తం అతడ్ని ఇబ్బంది పెడుతూ వచ్చారు. బ్యాటింగ్​కు దిగిన సమయంలోనూ ఇది కంటిన్యూ అయింది.

Hardik is compared to a dog

రోహిత్ అభిమానులు తనను గేలి చేస్తున్న సమయంలో హార్దిక్ రియాక్ట్ అయిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. బౌలింగ్ టైమ్​లో తనను ఎగతాళి చేయగా.. అతడు నవ్వుతూ కనిపించాడు. టిమ్ డేవిడ్​తో మాట్లాడుతూ లైట్ అంటూ రియాక్షన్ ఇచ్చాడు. బ్యాటింగ్​లో ఔట్ అయిన వెళ్తున్న సమయంలో బౌండరీ, సిక్స్ కొట్టానన్నట్టు బిల్డప్​గా చూశాడు. దీంతో కొడితే ఏం.. టీమ్ ఓడిందిగా అన్నట్లు ఫ్యాన్స్ మరింత ట్రోలింగ్ చేయడం పలు ఫొటోలు, వీడియోల్లో కనిపిస్తోంది. రోహిత్ 43 రన్స్ చేసినా, టీమ్​ను గెలిపించలేకపోయాననే బాధతో గ్రౌండ్​ను వీడగా.. హార్దిక్​ మాత్రం 11 పరుగులే చేసినా, ఏదో సాధించినట్లు పొగరుగా వెళ్లడంతో అభిమానులు అతడ్ని మరింత ఎగతాళి చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్స్.. ఇంతకు మించిన అవమానం మరొకటి ఉండదని అంటున్నారు. రోహిత్ ఫ్యాన్సే కాదు.. తమ టీమ్​ను మధ్యలో వదిలేసి వెళ్లినందుకు గుజరాత్ అభిమానులు కూడా అతడ్ని ట్రోలింగ్ చేశారని చెబుతున్నారు. మరి.. హార్దిక్​ను రోహిత్ ఫ్యాన్స్ ఎగతాళి చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: తొలి మ్యాచ్​లో కెప్టెన్​గా హార్దిక్ అట్టర్​ఫ్లాప్.. MI ఓటమికి 3 ప్రధాన కారణాలు!