iDreamPost

తొలి మ్యాచ్​లో కెప్టెన్​గా హార్దిక్ అట్టర్​ఫ్లాప్.. MI ఓటమికి 3 ప్రధాన కారణాలు!

  • Published Mar 25, 2024 | 9:09 AMUpdated Mar 25, 2024 | 9:09 AM

ఐపీఎల్-2024ను ముంబై ఇండియన్స్ ఓటమితో స్టార్ట్ చేసింది. ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అట్టర్​ఫ్లాప్ అయ్యాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎంఐ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్-2024ను ముంబై ఇండియన్స్ ఓటమితో స్టార్ట్ చేసింది. ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అట్టర్​ఫ్లాప్ అయ్యాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎంఐ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 25, 2024 | 9:09 AMUpdated Mar 25, 2024 | 9:09 AM
తొలి మ్యాచ్​లో కెప్టెన్​గా హార్దిక్ అట్టర్​ఫ్లాప్.. MI ఓటమికి 3 ప్రధాన కారణాలు!

అలవోకగా నెగ్గాల్సిన మ్యాచ్​లో పరాజయం పాలైంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్-2024ను ఆ టీమ్ ఓటమితో స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్​తో తలపడ్డ హార్దిక్ సేన 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓవరాల్​గా మ్యాచ్​లో బౌలింగ్, బ్యాటింగ్​లో ఎంఐ డామినేషన్ నడిచింది. కానీ కీలక సమయంలో ఒత్తిడికి గురైన ఆ టీమ్ టైటాన్స్​ను పడగొట్టలేకపోయింది. ఈ మ్యాచ్​లో ముంబై ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కానీ లోతుగా ఆలోచిస్తే ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాటింగ్

అహ్మదాబాద్ పిచ్​లో బాల్​ బ్యాట్ మీదకు బాగా వస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్​లో తేమ ఉండటంతో ముంబైకి ఛేజింగ్ ఈజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ టీమ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (43), నమన్ ధిర్ (20) ఇన్నింగ్స్​ను నిలబెట్టారు. కానీ వీళ్లిద్దరితో పాటు మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్న డెవాల్డ్ బ్రేవిస్ (46) కూడా మంచి స్టార్స్ అందుకున్నాక కీలక సమయాల్లో వెనుదిరిగారు. తిలక్ వర్మ (25) కూడా నిలబడాల్సిన టైమ్​లో చేతులెత్తేశాడు. పించ్ హిట్టర్ టిమ్ డేవిడ్ (11), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11) కూడా మ్యాచ్​ను ఫినిష్ చేయలేకపోయారు. బౌలింగ్​లో అదరగొట్టిన ముంబై.. అదే జోరును బ్యాటింగ్​లో కొనసాగిస్తే ఈజీగా నెగ్గేది. బ్యాటర్ల ఫెయిల్యూర్​ ఆ టీమ్​ను దెబ్బకొట్టింది.

హార్దిక్ పాండ్యా

ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్​లో టోటల్ ఫెయిల్ అయ్యాడు. బ్యాటర్​గా, కెప్టెన్​గా అతడు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అతడి వైఫల్యమే టీమ్‌ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. బౌలింగ్​లో బుమ్రా, కొయెట్జీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను చేతిలో పెట్టుకొని తానే మొదటి ఓవర్ వేశాడు. బుమ్రా, కొయెట్జీలు 5 వికెట్లు తీయగా.. పాండ్యా ఒక్క వికెట్ తీయకపోగా, 3 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చుకున్నాడు. పవర్​ప్లేలో ఇష్టం వచ్చినట్లు ఎవరితో పడితే వారితో బౌలింగ్ వేయించాడు. ఫీల్డ్ పొజిషన్స్​ కూడా సరిగ్గా లేవు. బ్యాటింగ్​లో తన అవసరం ఉన్న టైమ్​లో దిగకుండా.. టిమ్ డేవిడ్​ను పంపాడు. రషీద్​ ఖాన్​ను హార్దిక్ ఎదుర్కొని పరుగులు చేస్తే ముంబై ఈజీగా నెగ్గేది. స్పిన్​ ఆడటంలో వీక్ అయిన డేవిడ్​ను పంపడం, తిలక్ కూడా రషీద్​ను డీల్ చేయలేకపోవడంతో అనవసర ప్రెజర్ పెరిగి ఆ తర్వాత వికెట్లు టపటపా పడ్డాయి. ఆఖర్లో వచ్చిన పాండ్యా మ్యాచ్​ను ముగిస్తాడనుకుంటే అదీ చేయలేదు.

టీమ్ ఎఫర్ట్

ముంబై జట్టులో ఇండివిడ్యువల్​గా చూసుకుంటే బౌలింగ్​లో బుమ్రా (3/14), కొయెట్జీ (2/27) రాణించారు. బ్యాటింగ్​లో రోహిత్ (43), బ్రేవిస్ (46) బాగా ఆడారు. అయితే ఓవరాల్​గా చూసుకుంటే ఎంఐలో టీమ్ ఎఫర్ట్ క్లియర్​గా మిస్ అయింది. దానికి కెప్టెన్ హార్దిక్​తో పాటు కోచ్ తప్పిదమే కనిపిస్తోంది. ఏ ప్లేయర్​ను ఎప్పుడు బ్యాటింగ్​కు దింపాలి? ఎవరితో ఎప్పుడు బౌలింగ్ చేయాలి? అనే స్ట్రాటజీ మిస్సయింది. బౌలింగ్​లో పవర్​ప్లేలోనే రెండు ఓవర్లు వేసిన పాండ్యా.. బ్యాటింగ్​లో మాత్రం డౌన్ ది ఆర్డర్​లో వచ్చాడు. రషీద్​ బౌలింగ్​లో ఆడేందుకు అతడు భయపడినట్లు స్పష్టంగా తేలిపోయింది. టిమ్ డేవిడ్​ను ఇబ్బందికర పరిస్థితుల్లో బ్యాటింగ్​కు దింపడం మైనస్​గా మారింది. బాగా ఆడుతున్న రోహిత్, బ్రేవిస్ జోడీని అలాగే కంటిన్యూ చేయమని సూచించాల్సింది. వాళ్లను అటాక్ చేయమనడంతో అనవసరంగా ఔట్ అయ్యారు. ఇలా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు బాగున్నా.. వాళ్లతో ఏం కావాలో అది చేయించుకోకపోవడం మైనస్​గా మారింది. గుజరాత్ ప్లేయర్లలో కనిపించిన గెలవాలనే కసి, తపన ముంబై ఆటగాళ్లలో లోపించింది.

ఇదీ చదవండి: RR vs LSG: తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన సంజు శాంసన్‌! ఇది కదా రికార్డ్‌ అంటే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి