iDreamPost

CSK vs GT: ఓటమి బాధలో ఉన్న గిల్ కు ఊహించని షాక్! ఏంటంటే?

ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు ఊహించని షాక్ తగిలింది. అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు ఊహించని షాక్ తగిలింది. అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

CSK vs GT: ఓటమి బాధలో ఉన్న గిల్ కు ఊహించని షాక్! ఏంటంటే?

గత ఐపీఎల్ లో రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ ను థ్రిల్లింగ్ మ్యాచ్ లో చిత్తుచేసింది. అయితే ఇదే జోరును తన నెక్ట్స్ మ్యాచ్ లో చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తాజాగా చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 63 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. కాగా.. ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు ఊహించని షాకిచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవి చూసింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై.. 63 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఓటమి బాధలో ఉన్న ఆ టీమ్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు భారీ షాకిచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ కెప్టెన్ గిల్ కు భారీ జరిమాని విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని రూల్ ప్రకారం నిర్ణీత టైమ్ కి ఓవర్లు పూర్తి చేయకపోవడంతో.. గిల్ కు రూ. 12 లక్షలు ఫైన్ వేస్తున్నాం అని ఐపీఎల్ మేనేజ్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.

Unexpected shock to Gil

దీంతో ఇప్పటికే ఓడిపోయి బాధలో ఉన్న గిల్ కు ఇది ఊహించని షాకనే చెప్పాలి. ఇక ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడిన తొలి కెప్టెన్ గా గిల్ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు చెన్నై వరుసగా రెండు విజయాలను నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. గుజరాత్ టీమ్ ఓ విజయం ఓ ఓటమితో 2 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది. ఇక తన నెక్ట్స్ మ్యాచ్ ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడబోతోంది. మరి గిల్ కు ఊహించని విధంగా భారీ జరిమానా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: SRH vs MI మ్యాచ్ కు వెళ్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి! లేకపోతే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి