iDreamPost

GT vs DC: గుజరాత్ చెత్త రికార్డు.. ఇలా జరగడం ఇదే తొలిసారి!

  • Published Apr 17, 2024 | 9:58 PMUpdated Apr 17, 2024 | 9:58 PM

గుజరాత్ టైటాన్స్​ చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ టీమ్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.

గుజరాత్ టైటాన్స్​ చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ టీమ్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.

  • Published Apr 17, 2024 | 9:58 PMUpdated Apr 17, 2024 | 9:58 PM
GT vs DC: గుజరాత్ చెత్త రికార్డు.. ఇలా జరగడం ఇదే తొలిసారి!

గుజరాత్ టైటాన్స్​.. ఐపీఎల్​లో ఫేవరెట్ టీమ్స్​లో ఒకటి. రెండేళ్ల కింద టైటిల్​ను కొట్టేసిన ఆ జట్టు.. గతేడాది రన్నరప్​గా నిలిచింది. ఈసారి శుబ్​మన్ గిల్ నాయకత్వంలో బాగానే ఆడుతోంది. గిల్​తో పాటు డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, వృద్ధిమాన్ సాహా లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ కలిగిన జీటీ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. అయితే ఇంత మంచి టాలెంటెడ్ బ్యాటర్లు కలిగిన టీమ్ ఇవాళ అనూహ్యంగా కుప్పకూలింది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో 89 పరుగులకే ఆలౌట్ అయింది జీటీ. తద్వారా ఓ చెత్త రికార్డును నెలకొల్పింది.

ఢిల్లీతో మ్యాచ్​లో 89 పరుగులకే ఆలౌట్ అయిన గుజరాత్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఆ టీమ్ హిస్టరీలో 100 పరుగుల్లోపే కుప్పకూలడం ఇదే ఫస్ట్ టైమ్. మూడేళ్లుగా ఐపీఎల్​లో అదరగొడుతున్న జీటీ లోస్కోర్లు ఎప్పుడూ చేయలేదు. అలాంటిది ఇవాళ డీసీతో మ్యాచ్​లో అనూహ్యంగా ఆలౌట్ అయింది. టీమ్​లో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. స్పిన్ ఆల్​రౌండర్ రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్ అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడు ఆఖర్లో వచ్చి బ్యాట్ ఝళిపించకపోతే ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. రషీద్ తర్వాత సాయి సుదర్శన్ (12), రాహుల్ తెవాటియా (10) మాత్రమే డబుల్ ఫిగర్స్​కు చేరుకున్నారు. కెప్టెన్ గిల్ (8) సహా బ్యాటర్స్ అంతా ఫెయిలయ్యారు. డీసీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ చెరో 2 వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్ 3 వికెట్లతో చెలరేగాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి