Nidhan
భారత జట్టులోని ఓ ఆటగాడిపై వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా ప్రశంసల జల్లులు కురిపించాడు. అతడు క్రికెట్లోని అన్ని రికార్డులు తుడిచి పెట్టేస్తాడని అన్నాడు.
భారత జట్టులోని ఓ ఆటగాడిపై వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా ప్రశంసల జల్లులు కురిపించాడు. అతడు క్రికెట్లోని అన్ని రికార్డులు తుడిచి పెట్టేస్తాడని అన్నాడు.
Nidhan
టీమిండియా లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్‌తో వీళ్లు ఆ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఇక మీదట వన్డేలు, టెస్టుల్లో మాత్రమే ఈ ఛాంపియన్ ప్లేయర్స్‌ను చూడగలం. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో ఈ ఇద్దరు స్టార్లు వన్డేల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కేవలం టెస్టుల్లో ఆడుతూ మరికొన్నాళ్లు యంగ్‌స్టర్స్‌కు సపోర్ట్‌గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రోకో జోడీ వారసత్వాన్ని ఎవరు అందుకుంటారు? ముఖ్యంగా రన్ మెషీన్ కోహ్లీలా ఎవరు ఇంటర్నేషనల్ క్రికెట్లో డామినేట్ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా రియాక్ట్ అయ్యాడు.
కోహ్లీకి సరైన వారసుడు యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అని లారా అన్నాడు. విరాట్ మాదిరిగా వచ్చే దశాబ్దం అతడు ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడని చెప్పాడు. అతడి దెబ్బకు అన్ని రికార్డులు బద్దలు అవడం ఖాయమన్నాడు లారా. ‘ప్రస్తుత తరంలో మోస్ట్ టాలెంటెడ్ బ్యాటర్లలో మొదటి వరుసలో ఉంటాడు శుబ్‌మన్ గిల్. అతడి బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతం. వచ్చే కొన్నేళ్ల పాటు వరల్డ్ క్రికెట్‌ను అతడు రూల్ చేస్తాడు. అతడి మీద నాకు చాలా నమ్మకం ఉంది. క్రికెట్లోని ఎన్నో బిగ్ రికార్డ్స్‌ను అతడు బ్రేక్ చేయడం ఖాయం’ అని లారా చెప్పుకొచ్చాడు. శుబ్మన్తో పాటు మరో భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మీద కూడా లారా ప్రశంసల జల్లులు కురిపించాడు.
ఎంతో క్లిష్టమైన తన ‘400’ రికార్డును కొట్టే సత్తా గిల్-జైస్వాల్‌కు మాత్రమే ఉందన్నాడు లారా. వీళ్లిద్దరూ ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాళ్లని మెచ్చుకున్నాడు. ‘గిల్-జైస్వాల్‌కు సమయం కలిసొచ్చి క్రీజులో నిలదొక్కుకుంటే నా రికార్డును అధిగమించగలరు. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, సనత్ జయసూర్య, ఇంజమాముల్ హక్ లాంటి అటాకింగ్ ప్లేయర్లు ఉండేవారు. వాళ్లు నా 400 రికార్డును బ్రేక్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కనీసం 300 మార్క్‌ను అందుకున్నా చాలని అనుకున్నారు. కానీ ఇప్పుడా సిచ్యువేషన్ లేదు. రియల్ టెస్ట్ లాంటి లాంగ్ ఫార్మాట్లో దూకుడుగా ఆడే బ్యాటర్లు కనిపించడం లేదు. భారత జట్టులో గిల్-జైస్వాల్ రూపంలో ఇద్దరు సాలిడ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్లకు నా రికార్డును బద్దలు కొట్టే సత్తా ఉంది’ అని లారా చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీలా గిల్ క్రికెట్‌ను శాసిస్తాడంటూ లారా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Brian Lara said – “Shubman Gill is the Most talented batter in this new generation. He will rule cricket in the coming years. I believe he will go on to break many big records”. (Daily Mail). pic.twitter.com/RdQ0GIXTWS
— Tanuj Singh (@ImTanujSingh) July 14, 2024