iDreamPost
android-app
ios-app

Rohit-Kohli: రోహిత్-కోహ్లీ వారసులు ఎవరు? భారత బ్యాటింగ్ భారాన్ని మోసేది వాళ్లేనా?

  • Published Jul 16, 2024 | 8:49 PMUpdated Jul 16, 2024 | 8:49 PM

భారత క్రికెట్ మూలస్తంభాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పేశారు. వన్డేలు, టెస్టుల్లో ఎప్పటివరకు వీళ్లు కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలకు సరైన రీప్లేస్​మెంట్ ఎవరనే డిస్కషన్ స్టార్ట్ అయింది.

భారత క్రికెట్ మూలస్తంభాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పేశారు. వన్డేలు, టెస్టుల్లో ఎప్పటివరకు వీళ్లు కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలకు సరైన రీప్లేస్​మెంట్ ఎవరనే డిస్కషన్ స్టార్ట్ అయింది.

  • Published Jul 16, 2024 | 8:49 PMUpdated Jul 16, 2024 | 8:49 PM
Rohit-Kohli: రోహిత్-కోహ్లీ వారసులు ఎవరు? భారత బ్యాటింగ్ భారాన్ని మోసేది వాళ్లేనా?

భారత క్రికెట్ మూలస్తంభాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పేశారు. వన్డేలు, టెస్టుల్లో ఎప్పటివరకు వీళ్లు కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి. పొట్టి కప్పు తర్వాత టీ20ల నుంచి వీళ్లు రిటైర్ అవుతారని ఎవరూ అనుకోలేదు. హఠాత్తుగా డెసిషన్ ప్రకటించారు. వచ్చే ఏడాది 50 ఓవర్ల ఫార్మాట్​లో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఆ టోర్నీతో రోకో జోడీ వన్డేలకు కూడా గుడ్​బై చెబుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలకు సరైన రీప్లేస్​మెంట్ ఎవరనే డిస్కషన్ స్టార్ట్ అయింది. రోహిత్, కోహ్లీని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. మూడు ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా పరుగులు చేస్తూ.. రాబోయే దశాబ్ద కాలం పాటు టీమ్​కు అన్నీ తామై నిలవాల్సిన ఆటగాళ్ల అవసరం ఇప్పుడు భారత్​కు ఉంది.

ఒక రకంగా చెప్పాలంటే భారత క్రికెట్​కు ఇది సంధి కాలమనే అనాలి. రోహిత్-కోహ్లీ టీ20ల నుంచి తప్పుకున్నారు. మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ ఎన్నాళ్లు కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఆ స్టార్లు ఉన్నన్ని రోజుల్లోనే వాళ్ల వారసులను వెతికిపట్టుకోవాలి. ప్రస్తుత భారత జట్టును గమనిస్తే రోహిత్-కోహ్లీని రీప్లేస్ చేసే సత్తా ఉన్న ముగ్గురు ఆటగాళ్లు కనిపిస్తారు. అందులో మొదటివాడు శుబ్​మన్ గిల్. 24 ఏళ్ల ఈ యంగ్ బ్యాటర్ గత నాలుగేళ్లుగా టీమ్​తో ట్రావెల్ అవుతున్నాడు. ఈ రెండేళ్లలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడి స్థాయికి ఎదిగాడు. ఇటీవల జరిగిన జింబాబ్వే సిరీస్​లో జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు. బ్యాట్​తో పరుగుల వరద పారించడం, కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం, యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడటంలో గిల్ దిట్ట. అందుకే ఇతడ్ని నెక్స్ట్ విరాట్ కోహ్లీగా పిలుస్తున్నారు.

రోహిత్-విరాట్​ వారసులుగా వినిపిస్తున్న పేర్లలో మరొకటి యశస్వి జైస్వాల్. ఈ 22 ఏళ్ల కుర్ర ఓపెనర్ క్రీజులో అడుగుపెడితే చాలు భీకర షాట్లతో విరుచుకుపడతాడు. భారీ ఇన్నింగ్స్​లు ఆడటంలో ఆరితేరిన జైస్వాల్.. క్రీజులో ఉన్నంత సేపు ఉతుకుడే మంత్రంగా బ్యాటింగ్ చేస్తాడు. అందుకే నెక్స్ట్‌ హిట్​మ్యాన్​ జైస్వాలేనని అంటున్నారు. ఇక, భారత బ్యాటింగ్ భారాన్ని రాబోయే కొన్నేళ్ల పాటు మోయగల సత్తా ఉన్న ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ పేరు తెచ్చుకున్నాడు. ఇన్నింగ్స్ మొదట్లో నెమ్మదిగా ఆడటం, ఆ తర్వాత జూలు విదిల్చి భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడం రుతురాజ్ శైలి. చెన్నై సూపర్ కింగ్స్​కు కెప్టెన్​గా కూడా ఉన్న గైక్వాడ్​లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. బ్యాటర్​గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు కెప్టెన్​గా టీమ్​ను నడిపించే సత్తా కూడా ఉంది. ఈ ముగ్గురు ప్లేయర్లు తమ సత్తాకు తగ్గట్లు ఆడితే రోహిత్-కోహ్లీ లేని లోటు కనిపించదని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. భారత క్రికెట్​ భారాన్ని గిల్, జైస్వాల్, రుతురాజ్ మోయగలరని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి