iDreamPost

Rishabh Pant: GT vs DC మ్యాచ్.. చరిత్ర సృష్టించిన పంత్!

స్వల్ప స్కోర్లు నమోదు అయిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

స్వల్ప స్కోర్లు నమోదు అయిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Rishabh Pant: GT vs DC మ్యాచ్.. చరిత్ర సృష్టించిన పంత్!

ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. మెున్న లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించిన ఢిల్లీ.. నిన్న గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించింది. సమష్టిగా రాణించిన పంత్ సేన 6 వికెట్లతో గుజరాత్ ను చిత్తుచేసింది. గుజరాత్ బ్యాటర్లకు కనీసం ప్యాడ్స్, గ్లౌవ్స్ వేసుకునే టైమ్ కూడా ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. ఇక స్వల్ప స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో తొలుత వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి విజయాలబాట పట్టింది. వరుసగా రెండు గెలుపులతో ఫామ్ లోకి వచ్చింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 17.3 ఓవర్లలో కేవలం 89 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. జట్టులో సాయి సుదర్శన్(12), రాహుల్ తెవాటియా(10), రషీద్ ఖాన్(31) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ కు క్యూ కట్టారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, ఇషాంత్ 2, స్టబ్స్ 2 వికెట్లతో రాణించాడు.

అనంతరం 90 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. పంత్(16*), జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్(20), పోరెల్(15), షై హోప్(19) పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును చేరుకున్నాడు ఢిల్లీ కెప్టెన్ పంత్. గుజరాత్ ప్లేయర్లలో నలుగురును ఔట్ చేయడంలో పంత్ భాగస్వామ్యం అయ్యాడు. అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్ లను స్టంపౌట్ చేయగా.. డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ లను క్యాచౌట్ చేశాడు. దీంతో ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు సాధించడంలో పార్ట్ నర్ అయిన ఢిల్లీ వికెట్ కీపర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో 2009లో రాజస్తాన్ రాయల్స్ పై దినేశ్ కార్తిక్(4) సాధించిన రికార్డ్ సమమైంది. మరి యాక్సిడెంట్ అనంతరం గ్రేట్ ఫుల్ కంబ్యాక్ ఇస్తున్న పంత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి