iDreamPost

DC vs KKR: ఆ ఓవర్‌లో పంత్ విధ్వంసం.. సెలెక్టర్స్‌కు మాస్ మెసేజ్!

  • Published Apr 04, 2024 | 1:57 PMUpdated Apr 04, 2024 | 1:57 PM

రీఎంట్రీలో రఫ్ఫాడిస్తున్నాడు రిషబ్ పంత్. కసి తీరా బాల్​ను బాదుతూ సెలెక్టర్స్​కు మాస్ మెసేజ్ పంపాడు. కోల్​కతాపై ఓ ఓవర్​లో విధ్వంసం సృష్టించాడతను.

రీఎంట్రీలో రఫ్ఫాడిస్తున్నాడు రిషబ్ పంత్. కసి తీరా బాల్​ను బాదుతూ సెలెక్టర్స్​కు మాస్ మెసేజ్ పంపాడు. కోల్​కతాపై ఓ ఓవర్​లో విధ్వంసం సృష్టించాడతను.

  • Published Apr 04, 2024 | 1:57 PMUpdated Apr 04, 2024 | 1:57 PM
DC vs KKR: ఆ ఓవర్‌లో పంత్ విధ్వంసం.. సెలెక్టర్స్‌కు మాస్ మెసేజ్!

అప్పట్లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. ఇంక కోలుకోలేడని అంతా అనుకున్నారు. ఒకవేళ రికవర్ అయినా మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టలేదని ఫిక్స్ అయ్యారు. ఫ్యూచర్ స్టార్ కెరీర్ మధ్యలోనే ముగిసిందని భావించారు. కానీ విధిని జయించిన ఆ మృత్యుంజయుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకొని బ్యాట్ పట్టి కసితో సాధన చేశాడు. కమ్​బ్యాక్​లో ఒక ఇన్నింగ్స్​ను మించి మరో ఇన్నింగ్స్​తో అదరగొడుతున్నాడు. అతడే రిషబ్ పంత్. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి సూపర్ ఫామ్​లో ఉన్నాడు. రెండేళ్ల తర్వాత క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ బ్యాటర్.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. నిన్న కోల్​కతా నైట్ రైడర్స్​తో మ్యాచ్​లో కూడా మాస్ బ్యాటింగ్​తో రెచ్చిపోయాడు. ఒక ఓవర్​లో విధ్వంసం సృష్టించిన పంత్.. సెలెక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు.

కోల్​కతాపై మ్యాచ్​లో 25 బంతులు ఎదుర్కొన్న పంత్.. 55 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. కేకేఆర్ బౌలర్లందర్నీ ఆడేసుకున్నాడు పంత్. మరీ ముఖ్యంగా ఆల్​రౌండర్ వెంకటేష్ అయ్యర్​ను టార్గెట్ చేసి బాదాడు. అతడు వేసిన 12వ ఓవర్​లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్ తొలి బంతిని ఫోర్​గా మలచిన పంత్.. తర్వాతి రెండు బంతులను స్టాండ్స్​లోకి పంపాడు. ఆఖరి మూడు బంతులకు బౌండరీలు కొట్టాడు. అయ్యర్ లెగ్ సైడ్ వైపు వేసిన ఓ బాల్​ను అద్భుతమైన రీతిలో నెవర్ లుక్ షాట్​తో సిక్స్​గా మలిచాడు పంత్. నిలబడ్డ చోటే కాస్త వంగి బాల్​ను ఫ్లిక్ చేసి స్టాండ్స్​లోకి పంపాడు. అయితే ఈ మాస్ ఇన్నింగ్స్ ద్వారా టీమిండియా సెలక్టర్లకు మాస్ మెసేజ్ ఇచ్చాడు పంత్.

జూన్ నెలలో టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో భారత క్రికెట్ బోర్డు టీమ్​ను ఎంపిక చేయాల్సిందిగా సెలక్టర్లను ఆదేశించింది. ఆ పనిలో భాగంగానే ఐపీఎల్​లోని మ్యాచులను కూడా లైవ్​గా స్టేడియాలకు వచ్చి మరీ తిలకిస్తున్నారట సెలక్టర్లు. ఈ నేపథ్యంలో వాళ్లకు స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు పంత్. ఒకే ఓవర్​లో 28 రన్స్ బాదడమే గాక.. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో కలిపి 158.33 స్ట్రైక్ రేట్​తో 152 రన్స్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీలు బాదాడు. కీపింగ్​లో తన మార్క్​ చూపిస్తున్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ ఫిట్​నెస్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా కమ్​బ్యాక్​లో అన్ని విధాలుగా తాను తోపు అని నిరూపించుకున్న పంత్.. టీ20 వరల్డ్ కప్​కు తనను ఎలాగైనా ఎంపిక చేయాల్సిందేనని ఇన్​డైరెక్ట్​గా వార్నింగ్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇంత బాగా ఆడుతున్నప్పుడు సెలక్ట్ చేయడం తప్పితే బోర్డుకు ఇంకో ఆప్షన్ కూడా లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సెలక్టర్లకు పంత్ స్ట్రాంగ్ మెసేజ్​ పంపడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: SRHకు హీరోగా మారిన ఇషాంత్ శర్మ.. రుణం తీర్చుకున్న పేసర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి