iDreamPost

SRHకు హీరోగా మారిన ఇషాంత్ శర్మ.. రుణం తీర్చుకున్న పేసర్!

  • Published Apr 04, 2024 | 12:47 PMUpdated Apr 04, 2024 | 12:47 PM

ఏస్ పేసర్ ఇషాంత్ శర్మ సన్​రైజర్స్ హైదరాబాద్​కు హీరోగా మారాడు. ఒకప్పుడు ఎస్​ఆర్​హెచ్​కు ఆడిన ఇషాంత్ ఆ రుణం తీర్చుకున్నాడు.

ఏస్ పేసర్ ఇషాంత్ శర్మ సన్​రైజర్స్ హైదరాబాద్​కు హీరోగా మారాడు. ఒకప్పుడు ఎస్​ఆర్​హెచ్​కు ఆడిన ఇషాంత్ ఆ రుణం తీర్చుకున్నాడు.

  • Published Apr 04, 2024 | 12:47 PMUpdated Apr 04, 2024 | 12:47 PM
SRHకు హీరోగా మారిన ఇషాంత్ శర్మ.. రుణం తీర్చుకున్న పేసర్!

సన్​రైజర్స్ హైదరాబాద్ ఈసారి చాలా బలంగా కనిపిస్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడినప్పటికీ టీమ్ ఆడుతున్న తీరు బాగుంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టును ముందుండి బాగా నడిపిస్తున్నాడు. బౌలింగ్​లో అదరగొడుతున్న కమిన్స్.. ఫీల్డింగ్ పొజిషన్స్​తో పాటు బౌలింగ్ ఛేంజెస్​లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగం కూడా బాగుంది. ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో ఎస్ఆర్​హెచ్ బ్యాటర్లు ఆడిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఆకాశమే హద్దుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ చెలరేగిపోయారు. అందుకే ఐపీఎల్​ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో 277 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. అయితే ఈ రికార్డు చేజారకుండా ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ కాపాడాడు.

కోల్​కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏకంగా 272 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్​కతా బ్యాటర్ల జోరు చూస్తుంటే సన్​రైజర్స్ 277 పరుగుల రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపించింది. అప్పటికే 19 బంతుల్లో 41 పరుగులు చేసి ఊపు మీదున్నాడు ఆండ్రీ రస్సెల్. మరో 14 పరుగులు చేస్తే ఎస్​ఆర్​హెచ్​ స్కోరును దాటేసి కేకేఆర్ చరిత్ర సృష్టించేది. ఇంకో 6 బంతులు ఉన్నాయి. దీంతో అరుదైన ఘనత నమోదవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ లాస్ట్ ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ తొలి బంతికే రస్సెల్​ను క్లీన్​ బౌల్డ్ చేశాడు. డెడ్లీ యార్కర్​తో రస్సెల్​ను దెబ్బతీశాడు. ఆ బంతి 144 కిలోమీటర్ల వేగంతో పడిన వెంటనే వికెట్ల మీదకు దూసుకురావడంతో డిఫెన్స్ చేయలేకపోయిన రస్సెల్ పిచ్చోడైపోయాడు. ఔట్ అయి వెళ్తున్న టైమ్​లో ఇషాంత్​ను మెచ్చుకున్నాడు.

రస్సెల్​తో పాటు అదే ఓవర్​లో రమణ్​దీప్ సింగ్ (2)ను కూడా పెవిలియన్​కు పంపాడు ఇషాంత్. కోల్​కతా ఇన్నింగ్స్ ముగిసేసరికి 272 పరుగుల దగ్గర ఆగింది. ఎస్​ఆర్​హెచ్​ రికార్డు సేఫ్ అయిపోయింది. దీంతో సన్​రైజర్స్​కు హీరోగా మారిపోయాడు ఇషాంత్. అతడి వల్లే అరుదైన రికార్డును ఎస్​ఆర్​హెచ్​ కాపాడుకుందని అభిమానులు అంటున్నారు. ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసిన ఇషాంత్​ను మెచ్చుకుంటున్నారు. అతడు గనుక రస్సెల్​ను ఔట్ చేయకపోయి ఉంటే తమ రికార్డు మాయమయ్యేదని చెబుతున్నారు. మరికొందరేమో ఇషాంత్ సన్​రైజర్స్ రుణాన్ని తీర్చుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎస్​ఆర్​హెచ్​కు ఆడిన ఈ పేసర్.. ఇప్పుడు హయ్యెస్ట్ స్కోరు రికార్డును కాపాడి టీమ్ రుణాన్ని తీర్చుకున్నాడని చెబుతున్నారు. మరి.. ఇషాంత్ స్పెల్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: డ్రెస్సింగ్ రూమ్ లో హార్దిక్ స్పీచ్.. ఒక్క నవ్వుతో పరువు తీసేసిన బుమ్రా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి