iDreamPost

రోహిత్ శర్మ CSKకి నాయకత్వం వహించాలి.. రాయుడు కామెంట్స్ వెనక కారణమేంటి?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలను రోహిత్ శర్మ చేపట్టాలని అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాయుడు చేసిన ఈ వ్యాఖ్యల వెనక కారణమేంటని ఆలోచనలో పడ్డారు అభిమానులు. మరి ఆ కామెంట్స్ వెనక రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలను రోహిత్ శర్మ చేపట్టాలని అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాయుడు చేసిన ఈ వ్యాఖ్యల వెనక కారణమేంటని ఆలోచనలో పడ్డారు అభిమానులు. మరి ఆ కామెంట్స్ వెనక రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ CSKకి నాయకత్వం వహించాలి.. రాయుడు కామెంట్స్ వెనక కారణమేంటి?

ఈసారి ఐపీఎల్ రసవత్తరంగా సాగబోతోంది. ఈ టోర్నీ ప్రారంభం కాకముందే.. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను నియమించడంతో పెద్ద దూమారం లేచిన విషయం మనందరికి తెలిసిందే. ఈ ఘటనతో ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై, పాండ్యాపై రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ కోపంగానే ఉన్నారు. ఇక మార్చి 22 నుంచి స్టార్ట్ అవ్వనుంది క్యాష్ రిచ్ లీగ్. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు రోహిత్ శర్మ చేపట్టాలి అంటూ రాయుడు పేర్కొన్నాడు. మరి రాయుడు హాట్ కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి 2024 ఐపీఎల్ సీజనే చివరిదని ప్రచారం సాగుతోంది. పైగా ధోని తన మోకాలికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. వీటితో పాటుగా అతడి ఏజ్ కూడా పెరిగిపోతోంది. దీంతో సహజంగానే ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఇక ఈ వార్తల నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడు.”2024 ఐపీఎల్ తర్వాత ఒకవేళ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే.. 2025 ఐపీఎల్ సీజన్ లో చెన్నైసూపర్ కింగ్స్ తరఫున రోహిత్ శర్మ ఆడాలని కోరుకుంటున్నాను. ధోనిలా నాయకత్వం వహించగలడు హిట్ మ్యాన్. పైగా మరో 5-6 ఏళ్లు ఐపీఎల్ ఆడగలడు. రోహిత్ ఇప్పటికిప్పుడు ఏ టీమ్ కు కెప్టెన్ అవ్వాలనుకున్నా.. అవ్వగలడు” అంటూ రాయుడు చెప్పుకొచ్చాడు.

కాగా.. రోహిత్ ను ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ గా తొలగించిన తర్వాత కొన్ని ఫ్రాంచైజీలు సంప్రదించాయని సమాచారం. తమ జట్టులోకి రావాలని కోరినట్లు వార్తలు వైరల్ గా మారాయి. కానీ రోహిత్ మాత్రం ఇప్పటి వరకు ముంబై టీమ్ ను వదిలి వెళ్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. అయితే రోహిత్ అభిమానులు, SRH ఫ్యాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి వచ్చి.. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. సన్ రైజర్స్ తో పాటుగా మరికొన్ని ఫ్రాంచైజీలు కూడా హిట్ మ్యాన్ ను తమ జట్టులోకి రావాలని, సారథ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాయి. అయితే రాయుడు చేేసిన ఈ కామెంట్స్ వెనక కారణమేంటి? అని క్రికెట్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. గతంలో ముంబైకి ఆడినప్పుడు రోహిత్ కెప్టెన్సీలో రాయుడు ఆడాడు. అప్పుడు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇదే తాజా వ్యాఖ్యలకు కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి రోహిత్ ను సీఎస్కేకి నాయకత్వం వహించాలన్న అంబటి రాయుడు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విరాట్ కోహ్లీకి అక్కడ అంతసీన్ లేదు.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి