iDreamPost

విరాట్ కోహ్లీకి అక్కడ అంతసీన్ లేదు.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అక్కడు కోహ్లీకి అంతసీన్ లేదని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అక్కడు కోహ్లీకి అంతసీన్ లేదని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీకి అక్కడ అంతసీన్ లేదు.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నాడు. రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందిన విరాట్ ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుండటంతో.. ప్రాక్టీస్ కు దిగేందుకు సిద్ధమవుతున్నాడు. గత 16 సీజన్లుగా ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈసారైనా తొలి ఐపీఎల్ కప్ కొట్టాలని భావిస్తోంది కోహ్లీ టీమ్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్.

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ లో రన్ మెషిన్ గా పిలువబడుతున్నాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకుసాగుతున్నాడు. ఐపీఎల్ లో కూడా అద్భుతమైన రికార్డులను కలిగిఉన్నాడు విరాట్ భాయ్. ఇక మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్. ఐపీఎల్ లో సూపర్ రికార్డు ఉన్న కోహ్లీకి ఆ గ్రౌండ్ లో మాత్రం అంతసీన్ లేదని చెప్పుకొచ్చాడు టర్భోనేటర్ హర్భజన్.

హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ సొంత మైదానం బెంగళూరులో నాలుగు సెంచరీలు బాదాడు. ఇక రాజ్ కోట్, కోల్ కత్తా, హైదరాబాద్ లో ఒక్కో శతకం కొట్టాడు. కానీ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మాత్రం ఇంతవరకు చెప్పుకోదగ్గ నాక్ ఆడలేదు. స్పిన్ కు అనుకూలించే ఈ పిచ్ పై అతడి సగటు కేవలం 30. దీన్ని బట్టే అర్దం చేసుకోవచ్చు.. ఈ గ్రౌండ్ లో కోహ్లీకి అంత ఈజీకాదని. పైగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో రవీంద్ర జడేజా లాంటి వికెట్ టు వికెట్ బంతులు వేసే గొప్ప బౌలర్ ఉన్నాడు. ఈ పిచ్ పై బాల్ తిరగడం స్టార్ట్ అయితే బ్యాటర్లకు తిప్పలే. అయితే కోహ్లీ గట్టిగా నిలబడితే బౌలర్లకు చుక్కలే” అంటూ చెప్పుకొచ్చాడు ఈ మాజీ స్పిన్నర్.

ఇదిలా ఉండగా.. 2019 సీజన్ లో కోహ్లీ తన విశ్వరూపం చూపాడు. ఈ సీజన్ లో 16 మ్యాచ్ ల్లో ఏకంగా 973 రన్స్ చేశాడు. ఇందులో 4 శతకాలతో పాటుగా 7 అర్దశతకాలు ఉన్నాయి. ఒక ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ సాధించిన ఈ స్కోరే అత్యధికం కావడం విశేషం. అయితే ఇదే రేంజ్ లో చెలరేగితే ఆర్సీబీ ముందుకెళ్తుందని, కప్ సాధిస్తుందో.. లేదో ఇప్పుడే చెప్పలేమని భజ్జీ చెప్పుకొచ్చాడు. మరి విరాట్ కోహ్లీపై హర్భజన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024.. రిషబ్ పంత్ రీ ఎంట్రీపై NCA కీలక అప్డేట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి