iDreamPost

KGF ఫార్ములాను ఫాలో అవుతున్న పుష్పరాజ్!  ఏ విషయంలో అంటే?

టాలీవుడ్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 'కేజీఎఫ్' ఫార్ములాను పుష్పరాజ్ ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. మరి ఆ ఫార్ములా ఏంటి? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 'కేజీఎఫ్' ఫార్ములాను పుష్పరాజ్ ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. మరి ఆ ఫార్ములా ఏంటి? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

KGF ఫార్ములాను ఫాలో అవుతున్న పుష్పరాజ్!  ఏ విషయంలో అంటే?

గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ అయిన భారీ బడ్జెట్ చిత్రాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన పుష్ప సైతం రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15, 2024న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. పుష్పరాజ్ కేజీఎఫ్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

‘పుష్ప’ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 విడుదలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో పుష్ప 3 గురించి చర్చ మెుదలైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పార్ట్ 3 ఉంటుందని చిత్ర బృందం కూడా గతంలో పలు వేదికలపై చెప్పింది. దీంతో సుకుమార్-బన్నీలు సైతం కేజీఎఫ్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే? కేజీఎఫ్ 2 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ వేరే ప్రాజెక్ట్ లకు వెళ్లిపోయారు. ప్రశాంత్ నీల్ సలార్ 2 తర్వాత ఎన్టీఆర్ తో ఓ మూవీ తీస్తున్నాడు. ఇటు యశ్ ‘టాక్సిక్’ పూర్తి చేయాలి. అప్పుడే కేజీఎఫ్ 3 పట్టాలు ఎక్కేవ అవకాశం ఉంది.

కాగా.. ఇప్పుడు ఇదే ఫార్ములాను పుష్పరాజ్ ఫాలో అవుతున్నాడు. పుష్ప 2 తర్వాత వెంటనే పార్ట్ 3 స్టార్ట్ కాదు. ఎందుకంటే? బన్నీ ఇప్పటికే సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ తో కలిసి ఓ ప్రాజెక్ట్ లో నటించబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించి చర్చలు కూడా జరిగాయని సమాచారం. ఇక మరోవైపు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే చెప్పాడు. ఇటు సుకుమార్ సైతం రామ్ చరణ్ తో ఓ మూవీ చేయాలి. అయితే బుచ్చిబాబు-చరణ్ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే సుక్కు చిత్రం ప్రారంభం అవుతుంది.  మరి ఈలోపు వేరే ఏదైనా సీనిమా చేస్తాడా? లేదా? అన్నది సుకుమార్ కే తెలియాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. అంటే.. కేజీఎఫ్ 3, పుష్ప 3 సినిమాలు రావాలంటే మూడేళ్ల తర్వాతే అన్నమాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి