iDreamPost

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలు ప్రయాణంలో ఈ ఉచిత సేవలు పొందవచ్చు!

  • Published May 06, 2024 | 8:09 PMUpdated May 06, 2024 | 8:09 PM

భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ రైలు ప్రయాణంలో అతి తక్కువ ఛార్జీలతో కూడిన రైలు టికెట్ తో కేవలం ప్రయాణం చేయవచ్చు అనే చాలామందికి తెలుసు. కానీ, ఈ రైలు టికెట్ తో ప్రయాణం మాత్రమే కాకుండా అనేక సౌకర్యలు, సేవ ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ రైలు ప్రయాణంలో అతి తక్కువ ఛార్జీలతో కూడిన రైలు టికెట్ తో కేవలం ప్రయాణం చేయవచ్చు అనే చాలామందికి తెలుసు. కానీ, ఈ రైలు టికెట్ తో ప్రయాణం మాత్రమే కాకుండా అనేక సౌకర్యలు, సేవ ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published May 06, 2024 | 8:09 PMUpdated May 06, 2024 | 8:09 PM
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలు ప్రయాణంలో ఈ ఉచిత సేవలు పొందవచ్చు!

దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే కూడా ఒకటి. కాగా, ఈ రైళ్లలో తరుచు కోట్లాది మంది ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారు. అయితే చాలామంది ప్రయాణీకులు ఏదైనా దూర ప్రాంతాలకు తొందరగా, సురక్షితంగా వెళ్లాలనుకుంటే.. అందుకు ఈ రైలు ప్రయాణం ఎంతో మేలుగా ఉంటుదని చెప్పవచ్చు. అలాగే ఈ రైళ్ల ప్రయాణం అనేది ఇతర రావాణా అనగా బస్సులు, ఆటోలు, విమానాలతో పోలిస్తే టికెట్ ధర కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో సామాన్య ప్రజలు కూడా ఈ రైలు ప్రయాణానికి చాలా మెగ్గు చూపుతుంటారు. అయితే అతి తక్కువ ఛార్జీలతో కూడిన రైలు టికెట్ తో కేవలం ప్రయాణించవచ్చు అనే చాలామందికి తెలుసు. కానీ, ఈ టికెట్ ద్వారా వాస్తవానికి చాలా ఉపాయోగాలు ఉన్నాయని అంతగా ఎవరికి తెలియదు. మరి, ఈ రైలు టిక్కెట్ కొనుగోలు చేయడం ద్వారా రైల్వే ప్రయాణీకులకు ఎలాంటి సౌకర్యం సేవలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ రైలు ప్రయాణంలో అతి తక్కువ ఛార్జీలతో కూడిన రైలు టికెట్ తో కేవలం ప్రయాణం చేయవచ్చు అనే చాలామందికి తెలుసు. కానీ, ఈ రైలు టికెట్ తో ప్రయాణం మాత్రమే కాకుండా అనేక సౌకర్యలు, సేవ ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వే ఇప్పుడు తన ప్రయాణీకుల కోసం వివిధ సౌకర్యలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా రైల్వే ప్రయాణీకులకు టికెట్ ద్వారా.. రైల్వే దుప్పటి, దిండు, బెడ్ షీట్, హ్యాండ్ టవల్ను ఉచితంగా అందిస్తుంది.

గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ వంటి కొన్ని రైళ్లలో మాత్రం ప్రయాణీకులకు దీనికి అదనపు రుసుము చెల్లించాలి. ఇకపోతే ప్రత్యేకించి ప్రయాణీకుడికి బెడ్‌రోల్ అందించకపోతే..వారికి ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్య తలెత్తిన వారి భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. రైల్వే శాఖ ఉచితందగా వైద్య సహాయం అందజేస్తుంది. కాకపోతే ఇందుకోసం రైలు అధికారులను సంప్రదించాలని సూచించారు. అలాగే ఒక వేళ మీరు ప్రీమియం రైళ్లలో ప్రయాణించినట్లయితే.. మీ ఎక్కవలసిన రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే అప్పుడు రైల్వేనే మీకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా.. రైలు ఆలస్యం అయితే, మీరు రైల్వే ఈ-కేటరింగ్ సర్వీస్ ద్వారా కూడా ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

వీటితో పాటు దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో క్లోక్‌రూమ్, లాకర్ రూమ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక వాటిలో మీరు మీ లగేజీని సురక్షితంగా ఉంచుకోవడానికి ఉపయోగించవచ్చు. అయితే ఈ లాకర్ గదులలో మీరు ఒక నెలపాటు మీ వస్తువులను భద్రంగా ఉంచుకోవచ్చు. కానీ, దీనిపై మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ అది చాలా తక్కువ ఉండవచ్చు.దీంతో పాటు మీరు కొంత సమయం వరకు స్టేషన్‌లో ఉండవలసి వస్తే.. మీరు స్టేషన్‌లోని AC లేదా నాన్-ఏసీ వెయిటింగ్ హాల్‌లో హాయిగా వేచి ఉండవచ్చు. అయితే అక్కడ మీరు మీ రైలు టిక్కెట్‌ను చూపించాలి. అప్పుడు మీరు అక్కడ ఉండడానికి అనుమతి ఉంటుంది. మరి, ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే అందిస్తున్న ఈ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి