iDreamPost
android-app
ios-app

10th, ఇంటర్ పాసైతే చాలు.. 2,438 రైల్వే జాబ్స్ రెడీ.. రాత పరీక్ష లేదు

Southern Railway Recruitment 2024: మీరు టెన్త్, ఇంటర్ పాసయ్యారా? రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా 2438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

Southern Railway Recruitment 2024: మీరు టెన్త్, ఇంటర్ పాసయ్యారా? రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా 2438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

10th, ఇంటర్ పాసైతే చాలు.. 2,438 రైల్వే జాబ్స్ రెడీ.. రాత పరీక్ష లేదు

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి లక్కీ ఛాన్స్. ఏకంగా 2,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. జాబ్ లేదని నిరాశలో ఉన్నవారికి సువర్ణావకాశం. మీరు టెన్త్, ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇటీవల రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు 18వేలకు పైగా అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు సాధించి లైఫ్ లో సెట్ అవ్వడానికి ఇదే మంచి సమయం.

చెన్నైలోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ సదరన్ రైల్వే పరిధిలోని డిజిజన్ లు/ వర్క్ షాప్స్/ యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2,438 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పేయింటర్, డీజిల్ మెకానిక్, వైర్ మెన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడులలో ఐటీఐ పాసై ఉండాలి. అభ్యర్థులు 15-22 ఏళ్లు కలిగి ఉండాలి. విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 12 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 2,438

యూనిట్ల వారీగా ఖాళీల వివరాలు:

  • సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్ షాప్/పొదనూర్, కోయంబత్తూర్: 18
  • క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్/పెరంబూర్: 47
  • రైల్వే హాస్పిటల్/పెరంబూర్:20
  • సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్ షాప్/పొదనూర్, కోయంబత్తూర్: 52
  • తిరువనంతపూర్ డివిజన్: 145
  • సేలం డివిజన్: 222
  • పాలక్కాడ్ డివిజన్: 285
  • క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్/పెరంబూర్: 350
  • ఎలక్ట్రికల్ వర్క్ షాప్/పెరంబూర్: 130
  • లోకో వర్క్స్/పెరంబూర్: 228
  • ఇంజినీరింగ్ వర్క్ షాప్/అరక్కోణం: 48
  • చెన్నై డివిజన్/పర్సనల్ బ్రాంచ్: 24
  • చెన్నై డివిజన్-ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అరక్కోణం: 65
  • చెన్నై డివిజన్-ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అవడి: 65
  • చెన్నై డివిజన్-ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/తాంబరం: 55
  • చెన్నై డివిజన్-ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/రోయాపురం:30
  • చెన్నై డివిజన్- మెకానికల్(డీజిల్): 22
  • చెన్నై డివిజన్- మెకానికల్(క్యారేజ్ అండ్ వ్యాగన్): 250
  • చెన్నై డివిజన్ రైల్వే హాస్పిటల్(పెరంబూర్): 03
  • సెంట్రల్ వర్క్ షాప్స్, పొన్మలై: 201
  • తిరుచిరాపల్లి డివిజన్: 94
  • మధురై డివిజన్: 84

అర్హత:

  • కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడులలో ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 15-22 ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  •  రూ. 100 చెల్లించాలి.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

  • 12-08-2024