iDreamPost

World Cup: పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిదీ గాలి తీసేసిన రవిశాస్త్రి!

  • Author singhj Published - 01:34 PM, Sun - 15 October 23
  • Author singhj Published - 01:34 PM, Sun - 15 October 23
World Cup: పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిదీ గాలి తీసేసిన రవిశాస్త్రి!

వన్డే వరల్డ్ కప్​-2023లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్​ అందర్నీ సంతృప్తి పర్చలేకపోయింది. దీనికి కారణం పాక్ జట్టు గట్టి పోటీనివ్వకపోవడమే. ఒకరకంగా దాయాదుల ఫైట్ వన్ సైడ్ అయిందనే చెప్పాలి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ రోహిత్ సేన ముందు బాబర్ సేన ఆట సరితూగలేదు. మ్యాచ్​కు ముందు ఎన్ని గేమ్ ప్లాన్స్ అయినా వేసుకోవచ్చు. కానీ గ్రౌండ్​లోకి దిగాక వాటిని అమలు చేయడం ముఖ్యం. ఇందులో టీమిండియా నూటికి నూరు పాళ్లు సక్సెస్ అయితే.. పాక్ మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ టీమ్ ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్​ను బట్టే వాళ్లు చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు.

పాక్​తో మ్యాచ్​లో రోహిత్ శర్మ తన అగ్రెసివ్ బ్యాటింగ్​తో ఈసారి మెగా టోర్నీలో తాము ఇలాగే ఆడతామంటూ వార్నింగ్ బెల్స్ మోగించాడు. హిట్​మ్యాన్​తో పాటు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో భారత్​ అకౌంట్​లో ముచ్చటగా మూడో విజయం వచ్చి చేరింది. రోహిత్, అయ్యర్ కంటే కూడా గెలుపులో ఎక్కువ క్రెడిట్ టీమిండియా బౌలర్లకు ఇవ్వాలి. బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశారు. రివర్స్ స్వింగ్​ను రాబట్టి పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. స్పిన్నర్లు జడేజా, కుల్​దీప్ కూడా దాయాది ఇన్నింగ్స్​ను కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు పాక్ బ్యాటర్లలాగే బౌలర్లు కూడా ఫెయిలయ్యారు.

టార్గెట్ ఎక్కువ లేదు కాబట్టి పాకిస్థాన్ బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేస్తే భారత్​కు గెలవడం కాస్త కష్టమయ్యేది. కానీ రోహిత్ ముందు వారి పప్పులు ఉడకలేదు. ఆ టీమ్ స్టార్ బౌలర్లు షాహిన్ అఫ్రిదీ, హ్యారిస్ రౌఫ్​తో పాటు హసన్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్​ల బౌలింగ్​లో రోహిత్, అయ్యర్, కోహ్లీలు ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. మ్యాచ్​కు ముందు షాహిన్ అఫ్రిదీపై పాక్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. బుమ్రా కంటే షాహిన్​ ఎక్కువ వికెట్లు తీస్తాడని కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్​కు ముందు ఒక ఫ్యాన్ తనను సెల్ఫీ అడగ్గా.. షాహిన్ టీమిండియాపై 5 వికెట్లు తీశాకే సెల్ఫీ ఇస్తానంటూ ఓవరాక్షన్ చేశాడు.

మ్యాచ్​కు ముందు 5 వికెట్లు తీస్తానంటూ బిల్డప్ ఇచ్చిన షాహిన్ అఫ్రిదీ 2 వికెట్లే తీశాడు. అతడి బౌలింగ్​లో రోహిత్ శర్మ కొట్టిన పుల్ షాట్ సిక్స్ వెళ్లింది. ఈ మ్యాచ్​లో అదే హైలైట్ షాట్ అని చెప్పాలి. అయితే షాహిన్ బౌలింగ్​పై మ్యాచ్​లో కామెంట్రీ చేస్తున్న భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. షాహిన్​ పెద్ద తోపు బౌలరేం కాదని.. అతడికి అంత సీన్ లేదంటూ గాలి తీసేశాడు. ‘షాహిన్ అఫ్రిదీ వసీం అక్రమ్ కాదు. కొత్త బంతితో అతడు వికెట్లు తీయగలడు. షాహిన్ మంచి బౌలరే,​ వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ అతడి గురించి మరీ గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒప్పుకోవాల్సిందే’ అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. మరి.. షాహిన్​ అఫ్రిదీపై రవిశాస్త్రి చేసిన కామెంట్స్​తో మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాబర్​పై పాక్ లెజెండ్ సీరియస్.. కోహ్లీని ఎలా అడుగుతావంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి