iDreamPost

Team India: ఇంకెన్నాళ్లు వాళ్ల మీదే ఆధారపడతారు.. ఆ ఇద్దరూ రిటైరైతే..?

  • Published Jan 04, 2024 | 4:57 PMUpdated Jan 04, 2024 | 4:57 PM

భారత క్రికెట్ టీమ్ ఆ ఇద్దరు ప్లేయర్ల మీద అతిగా ఆధారపడుతోంది. అయితే ఇంకెన్నాళ్లు వాళ్ల పైనే డిపెండ్ అవుతుందనేది అర్థం కావడం లేదు. ఒకవేళ వాళ్లు రిటైరైతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

భారత క్రికెట్ టీమ్ ఆ ఇద్దరు ప్లేయర్ల మీద అతిగా ఆధారపడుతోంది. అయితే ఇంకెన్నాళ్లు వాళ్ల పైనే డిపెండ్ అవుతుందనేది అర్థం కావడం లేదు. ఒకవేళ వాళ్లు రిటైరైతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

  • Published Jan 04, 2024 | 4:57 PMUpdated Jan 04, 2024 | 4:57 PM
Team India: ఇంకెన్నాళ్లు వాళ్ల మీదే ఆధారపడతారు.. ఆ ఇద్దరూ రిటైరైతే..?

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్​లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన రోహిత్ సేన 153 పరుగులకు ఆలౌట్ అయింది. 153/4తో ఒక దశలో పటిష్టంగా కనిపించిన భారత్.. అదే స్కోరుకు ఆఖరి 6 వికెట్లు కోల్పోయింది. ఈజీగా 200 దాటుతుందని అనుకుంటే అదే స్కోరుకు కుప్పకూలింది. ఇలా ఒక్క రన్ కూడా చేయకుండానే ఒక టీమ్ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్. చెత్త రికార్డును ఖాతాలో వేసుకోవడంతో టీమిండియాపై విమర్శలు వస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాళ్లిద్దరూ రిటైరైతే టీమ్ గోవిందా అని అంటున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీద అతిగా ఆధారపడుతుండటం భారత జట్టును తీవ్రంగా దెబ్బతీస్తోంది. టీ20లు, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ ఇది క్లియర్​గా కనిపిస్తోంది. ప్రతిభ కలిగిన యంగ్​స్టర్స్ చాలా మందే ఉన్నా మెరుపు ఆరంభాలు అందిస్తూ లీడర్​షిప్​తో ముందుకు నడిపించే రోహిత్.. ఆఖరి వరకు నిలబడి మ్యాచ్​లు ఫినిష్ చేసే కోహ్లీ లాంటి ప్లేయర్ ప్రస్తుత జట్టులో మరొకరు కనిపించడం లేదు. ముఖ్యంగా టెస్టుల్లో సంయమనం, ఓపికను ప్రదర్శిస్తూ స్కోరు బోర్డు మీద ఒక్కో రన్ చేరుస్తూ ఇన్నింగ్స్​ను నిర్మించే ఆటగాళ్లే లేరు. పర్ఫెక్ట్ టైమింగ్, టెక్నిక్​తో బ్యాటింగ్ చేసేవాళ్లు లేకపోవడం భారత్​ను దెబ్బతీస్తోంది.

రోహిత్ , విరాట్ ఔట్ అయితే ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లేవాళ్లు లేరు. అందుకే తక్కువ స్కోర్లకే జట్టు కుప్పకూలుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ దీనికి బిగ్ ఎగ్జాంపుల్. ప్రొటీస్​తో జరిగిన తొలి టెస్ట్​లో కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్​లో టోటల్ ఫెయిల్ అవ్వడం భారత్​ను దెబ్బతీసింది. విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్​లో 38 పరుగులు, రెండో ఇన్నింగ్స్​లో 76 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా వృథా అయింది. చివరి టెస్ట్​లో రోహిత్ 39 పరుగులతో తొలి ఇన్నింగ్స్​లో ఫర్వాలేదనిపించాడు. సెకండ్ ఇన్నింగ్స్​లో 11 రన్స్​తో నాటౌట్​గా ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో కోహ్లీ 46 పరుగులతో ఆఖరి వరకు పోరాడాడు. ఇలా ఇద్దరు సీనియర్ బ్యాటర్లు రన్స్ చేస్తూ, వికెట్లు కాపాడుతూ ఇన్నింగ్స్​ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

రోహిత్, కోహ్లీ మీద అతిగా ఆధారపడటం, మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ అవుతుండటంతో భారత్​ సమస్యల బారిన పడుతోంది. దీని నుంచి బయటపడాలంటే హిట్​మ్యాన్​, విరాట్ మీద భారాన్ని తగ్గించాలి. అలాగే ఇతరులు కూడా పెర్ఫార్మ్ చేయాలి. అప్పుడే వరుస విజయాలు వస్తాయి. విదేశీ గడ్డ మీదా కన్​సిస్టెంట్​గా ట్రోఫీలు గెలవొచ్చు. అయితే దీనిపై నెట్టింట క్రికెట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇంకెన్నాళ్లు కోహ్లీ, రోహిత్ మీద ఓవర్​గా డిపెండ్ అవుతారని అంటున్నారు. వాళ్లు రిటైరైతే టీమ్ దిక్కుతోచని స్థితిలో పడుతుందని కామెంట్ చేస్తున్నారు. వాళ్లిద్దరూ టీమ్​లో ఉండగానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. మరి.. కోహ్లీ, రోహిత్​పై భారత జట్టు అతిగా ఆధారపడటం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: మార్క​రమ్ మార్వలెస్ సెంచరీ.. ప్రత్యర్థైనా మెచ్చుకోవాల్సిన ఇన్నింగ్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి