iDreamPost
android-app
ios-app

ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

CM Revanths Decision:తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

CM Revanths Decision:తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

గత ఏడాది తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పదేళ్ల పాలనకు చెక్ పెడుతూ కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికు మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ.500 గ్యాస్ సబ్సిడీ, 200 ఉచిత కరెంటు ఇలా పలు హామీలు నెరవేర్చారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకున్నారు? అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన దూకుడుతో పాలన కొనసాగిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, అధికారిక లోగో మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. అలాగే రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ గెజిట్ రిలీజ్ చేశారు. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.  తెలంగాణలో రెండు జిల్లాల పేర్లను మార్చతామని సీఎం కీలక ప్రకటన చేశారు. సూచన ప్రాయంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే జరిగితే తెలంగాణలో రెండు జిల్లాల పేర్లు మారనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు, ఉమ్మడి వరంగల్ లోని ఏదైనా జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టే యోచనలో ఉన్నట్లు సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. భూపాల పల్లి జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ అని, గద్వాలకు శక్తిపీఠం జోగులాంబ అని, భూవనగిరి జిల్లాకు యాదాద్రి, కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి, ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీం, సిరిసిల్ల జిల్లాకు వేములవాడ రాజన్న అంటూ చారిత్రక నేపథ్యం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లు పేట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి