iDreamPost
android-app
ios-app

కొడుకు మరణం.. గొప్ప నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్!

Sacrifice of Parents: తల్లిదండ్రులు కన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాంటిది తమ కళ్ల ముందే కొడుకు చనిపోతే ఆ దుఃఖం దిగమింది గొప్ప త్యాగం చేసి పదిమందికి ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు

Sacrifice of Parents: తల్లిదండ్రులు కన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాంటిది తమ కళ్ల ముందే కొడుకు చనిపోతే ఆ దుఃఖం దిగమింది గొప్ప త్యాగం చేసి పదిమందికి ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు

కొడుకు మరణం.. గొప్ప నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్!

నవ మాసాలు మోసి కనీ పెంచే పిల్లలపై ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తారు తల్లిదండ్రులు. తమ పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేరు. తమ తాహతకు మించి వారి కోరికలు తీర్చుతుంటారు. తమ పిల్లలు పెరిగి ప్రయోజకులై సమాజంలో గొప్పస్థాయిలో ఉండాలని కోరుకుంటారు. ఇటీవల మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబంలో చిన్న ప్రమాదం అఘాదం సృష్టించింది. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందే చనిపోయినా.. ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం పది మందికి ఆదర్శంగా నిలుస్తుంది. పుట్టెడు దుఃఖం దిగమింగుతూ ఆ తల్లిదండ్రుల త్యాగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు తల్లిదండ్రులు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలాని ప్రతిరోజూ దేవుళ్లను ప్రార్థిస్తుంటారు.కొడుకు మృత్యువడిలోకి చేరాడని తెలిసి కుమిలిపోయారు ఆ తల్లిదండ్రులు.తమ కొడుకు శరీరం పది మందికి ఉపయోగపడాలని గొప్పగా సంకల్పించారు. పుట్టెడు దుఖఃంలో ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం పదిమందికి ఆదర్శంగా నిలిచింది. ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి స్థానికులు హ్యాట్సాఫ్ చెబుతున్నాను. అసలేం జరిగిందంటే.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కుమ్మరిపాలానికి చెందిన శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులకు పవన్ కుమార్.. వయసు 19 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మే 1న ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు విరిగి పవన్ పై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు పవన్. చేతికి అందొచ్చిన కొడుక కళ్లముందే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

వైద్య బృందం సూచన మేరకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా తమ కొడుకు పదిమందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తమ కొడుకు అవయవాలు మరొకరికి దానం చేస్తే వారికి ప్రాణాలు పోస్తాయని ఆలోచించి అవయవదానానికి ముందుకు వచ్చారు.విశాఖ కీమ్స్ లో తమ కుమారడి అవయవాలు దానం చేశారు. తర్వాత మృతదేహాన్ని స్వగ్రామం అయిన దొడ్డిపట్ల గోదావరి తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. పవన్ అంతిమ యాత్రకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వందల మంది తరలి వచ్చారు. తమ కొడుకు చనిపోయినా కూడా ఆ బాధను దిగమింగి పది మంది మేలు కోరి అవయవదానం చేసిన తల్లిదండ్రుల హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి