iDreamPost

Team India: ఇండియాను తిట్టే ముందు మీ బతుకులు ఏంటో తెలుసుకోండి: గవాస్కర్

  • Published Jan 03, 2024 | 9:45 PMUpdated Jan 03, 2024 | 9:45 PM

టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సునీగ్ గవాస్కర్ ఓ విషయంలో సీరియస్ అయ్యాడు. భారత్​ను తిట్టే ముందు వాళ్లు తమ బతుకులు ఎలా ఉన్నాయో చూసుకోవాలన్నాడు.

టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సునీగ్ గవాస్కర్ ఓ విషయంలో సీరియస్ అయ్యాడు. భారత్​ను తిట్టే ముందు వాళ్లు తమ బతుకులు ఎలా ఉన్నాయో చూసుకోవాలన్నాడు.

  • Published Jan 03, 2024 | 9:45 PMUpdated Jan 03, 2024 | 9:45 PM
Team India: ఇండియాను తిట్టే ముందు మీ బతుకులు ఏంటో తెలుసుకోండి: గవాస్కర్

క్రికెట్​ ఆడే దేశాలు చాలానే ఉన్నాయి. అయినా అందరి ఫోకస్ టీమిండియా ఆడే మ్యాచుల మీదే ఉంటుంది. సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) లాంటి ఇతర బడా దేశాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు, క్రికెట్ లవర్స్ చూపు ఎప్పుడూ భారత్ మీదే ఉంటుంది. కొన్నేళ్ల గ్యాప్​లో బడా టీమ్​గా ఎదగడం, ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం, విదేశీ గడ్డ మీద కూడా సిరీస్​లు నెగ్గడం భారత్​కు అలవాటుగా మారింది. అందుకే టీమిండియా ఆడుతోందంటే చాలు.. క్రికెట్ ప్రేమికులు అందరూ టీవీలు, మొబైల్స్​కు అతుక్కుపోతారు. భారత్​తో సిరీస్​లు ఆడేందుకు అన్ని క్రికెటింగ్ నేషన్స్ కూడా తహతహలాడుతుంటాయి. కారణం టీమిండియాతో మ్యాచ్​లు ఆడితే భారీగా ఆదాయం సమకూరడమే. అయితే కొన్ని దేశాల మాజీ క్రికెటర్లు, మీడియా భారత్​ను పదే పదే టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగుతుంటాయి. దీనిపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యాడు.

ఇండియాను తిట్టే ముందు వాళ్లు తమ బతుకులు ఏంటో చూసుకోవాలన్నాడు గవాస్కర్. సేనా దేశాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలు కూడా ఆదాయం కోసం తరచూ భారత్​తో సిరీస్​లు ప్లాన్ చేస్తుంటాయి. టీమిండియాతో సిరీస్​లు ఆడితే టెలివిజన్ రైట్స్, టూరిజం రూపంలో భారీ మొత్తంలో డబ్బులు సమకూరుతుండటమే దీనికి కారణం. కానీ చాలా విషయాల్లో ఇటు భారత టీమ్​తో పాటు అటు బీసీసీఐని కూడా ఇతర దేశాల క్రికెటర్లు, మీడియా టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ విషయం మీద గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐ తమకు సపోర్ట్​ చేస్తోందనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నాడు. భారత జట్టు చేస్తున్న టూర్ల​ ద్వారా ఆయా దేశాల బోర్డులకు ఆదాయం సమకూరుతోందనే విషయాన్ని గ్రహించాలన్నాడు గవాస్కర్.

టీమిండియా ఆయా దేశాల్లో ఆడటం వల్లే టెలివిజన్ రైట్స్ రూపంలో అక్కడి క్రికెట్ బోర్డులకు భారీగా డబ్బులు వస్తున్నాయని గవాస్కర్ తెలిపాడు. అలాంటప్పుడు భారత్​ను టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగడం ఏంటని సీరియస్ అయ్యాడు. ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడే ముందు ఆయా దేశాల మాజీ క్రికెటర్లు, మీడియా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లు తమ బతుకులు ఏంటో తెలుసుకోవాలన్నాడు. భారత్ వల్ల వచ్చే ఆదాయంతో వారి బోర్డులు రన్ అవుతున్నాయిని.. అలాంటప్పుడు మళ్లీ టీమిండియాను విమర్శించడం ఏంటని ఫైర్ అయ్యాడు. టీమిండియా లేకపోతే వారి పరిస్థితి ఏంటని ఇన్​డైరెక్ట్​గా క్వశ్చన్ చేశాడు. మరి.. ఇతర క్రికెట్ దేశాలను టార్గెట్ చేస్తూ గవాస్కర్ ఇచ్చిన కౌంటర్​ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: కోహ్లీని రెచ్చగొట్టిన సౌతాఫ్రికా బౌలర్.. తన స్టైల్​లో ఇచ్చిపడేసిన విరాట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి