iDreamPost
android-app
ios-app

పరుగులు పెడుతున్న పసిడికి బ్రేక్.. ఈ రోజు ధర ఎంతంటే!

Gold and Silver Rates: బంగారం ధరలు ఎప్పుడు ఏ మార్పులు వస్తున్నాయో కొనుగోలుదారులకు అస్సలు అర్థం కావడం లేదు. నిన్న ఒక ధర ఉంటే.. ఈ రోజు మరో ధర. ప్రతిరోజూ ధర తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి.

Gold and Silver Rates: బంగారం ధరలు ఎప్పుడు ఏ మార్పులు వస్తున్నాయో కొనుగోలుదారులకు అస్సలు అర్థం కావడం లేదు. నిన్న ఒక ధర ఉంటే.. ఈ రోజు మరో ధర. ప్రతిరోజూ ధర తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి.

పరుగులు పెడుతున్న పసిడికి బ్రేక్.. ఈ రోజు ధర ఎంతంటే!

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.. స్థిరంగా కొనసాగుతుంది. ఇటీవల భారత దేశంలో పసిడి కొనుగోలు భారీగా పెరిగిపోయింది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ చేస్తే భవిష్యత్ లో మంచి లాభం ఉంటుందని భావిస్తున్నారు. ఆభరణాలుగానే కాకుండా వసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేస్తున్నారు. పసిడి ఎప్పటికైనా విలువైన లోహమే అంటారు. గత నెల బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన ఈ నెల కాస్త తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ధరలు పుంజుకున్నాయి.  మొన్నటి వరకు షాక్ ఇచ్చిన పసిడి నేడు ఊరటనిస్తుంది. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆడ, మగ అనే తేడా లేకుండా బంగారు ఆభరణాలు ధరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య బంగారం కొని పెట్టుకుంటే ఎప్పటికైనా లాభం ఉంటుందని.. బంగారం డిమాండ్ పెరిగిపోతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగారం కొనుగోలుదారులకు ధరలు ఊరటనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 వద్ద ఉంది. అంతకు ముందు రోజు రూ.800 వరకు పెరగి ఇదే ధర ఉంది. ఇక 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.74,620 వద్ద ఉంది. కిలో వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ. 96,400 వద్ద కొనసాగుతుంది.

today gold rates

దేశంలోని ప్రధాన నగరాల్లో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,540 ఉంటే.. 24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.74,760 వద్ద ట్రెండ్ అవుతుంది.ముంబై, కోల్ కొతా, బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,390 ఉంటే.. 24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.76,610 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 68,490 ఉంటే.. 24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.74,720 వద్ద ట్రెండ్ అవుతుంది. దేశ వ్యాప్తంగా కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 92,900 వద్ద కొనసాగుతుంది. బంగారం ధరలు తగ్గినపుడే కొంటే మంచి లాభం అని నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి