iDreamPost
android-app
ios-app

APకి వాతావవరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Published Jun 06, 2024 | 8:03 AMUpdated Jun 06, 2024 | 8:03 AM

ఏపీలో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షలు కరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని రాబోయే 3,4 రోజుల్లో ఈ జిల్లాలో భారీ వర్షలు పడే అవకాశాలు ఉన్నాయని వాతవరణ శాఖ తాజాగా హెచ్చరించింది.

ఏపీలో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షలు కరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని రాబోయే 3,4 రోజుల్లో ఈ జిల్లాలో భారీ వర్షలు పడే అవకాశాలు ఉన్నాయని వాతవరణ శాఖ తాజాగా హెచ్చరించింది.

  • Published Jun 06, 2024 | 8:03 AMUpdated Jun 06, 2024 | 8:03 AM
APకి వాతావవరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

గత కొన్ని రోజులుగా ఏపీలో అడపాదడపా వర్షాలు కురస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి పగటి పూట విపరీతమైన ఎండలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో భనుడు భగ భగ మంటున్నాడు. ఇలా రాష్ట్రంలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో విచిత్ర వాతవరణం నెలకొంటుంది. ఇదిలా ఉంటే..ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు రుతుపవనాలు వచ్చేశాయని రానున్న రోజుల్లో వర్షాలు పడే సూచనలు అధికంగా ఉన్నాయి వాతావరణ శాఖ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే.ఇక మరొపక్క రాయలసీమ జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించగా.. రాబోయే 3,4 రోజుల్లో కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణశాఖ తాజాగా తెలిపింది. అంతేకాకుండా.. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఏపీలో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షలు కరుస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి పగటి పూట భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడటంతో.. ప్రజలు ఈ ఉక్కపోతతో అల్లడిపోతున్నారు. కానీ, ఇప్పటికే  ఆంధ్రకు రుతుపవనాలు వచ్చేశాయని వాతవరణ శాఖ ఇదివరకే చల్లటి  కబురు చెప్పిన విషయం తెలిసిందే. అయితే  మరొపక్క రాయలసీమ జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. ఇక రాబోయే 3, 4 రోజుల్లో.. కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తాజాగా వాతావరణశాఖ తెలిపింది. అంంతేకాకుండా.. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Heavy rains in this district of AP

ఇక ఈరోజు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. ఇకపోతే శనివారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.  దీంతో పాటు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి