iDreamPost

HYDలోని ఈ 4 ఏరియాల్లో స్థలం కొంటే.. వద్దన్నా లక్షల్లో లాభం!

మీరు స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఈ నాలుగు ఏరియాల్లో స్థలాలు కొనుగోలు చేసినట్లైతే అధిక లాభాలు పొందొచ్చంటున్నారు నిపుణులు.

మీరు స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఈ నాలుగు ఏరియాల్లో స్థలాలు కొనుగోలు చేసినట్లైతే అధిక లాభాలు పొందొచ్చంటున్నారు నిపుణులు.

HYDలోని ఈ 4 ఏరియాల్లో స్థలం కొంటే.. వద్దన్నా లక్షల్లో లాభం!

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు. ఎందుకంటే స్థలాలపై పెట్టుబడి పెడితే కొంత కాలం తర్వాత పెట్టిన సొమ్ముకు రెట్టింపు లాభాలు రావడమే. మరి మీరు కూడా స్థలాలపై పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ సమయంలోనే లక్షల్లో లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు హైదరాబాద్ లోని ఈ నాలుగు ప్రాంతాల్లోని స్థలాలపై ఇన్వెస్ట్ చేస్తే కాసులు కురవడం ఖాయమంటున్నారు నిపుణులు.

భాగ్యనగరంలో ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు అన్నీ పెట్టుబడులు పెట్టేందుకు క్యూకడుతున్నాయి. ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ దూసుకెళ్తోంది. దేశం నలుమూలల నుంచి విద్యా, ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కోకాపేట వంటి ఏరియాల్లో ఎకరం స్థలం కోటికిపైగా పలికిన విషయం తెలిసిందే. ఈ ప్రకారంగా చూసినట్లైతే భవిష్యత్తులో భాగ్యనగరంలోని స్థలాలు పెట్టుబడిదారులకు సిరులు కురిపిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని అప్పాజంక్షన్, మోకిలా, కొల్లూర్, నానక్రాంగూడ వంటి ఏరియాల్లో స్థలాలు కొని కొంత కాలం తర్వాత అమ్ముకుంటే లక్షల్లో లాభాలు వస్తాయని చెబుతున్నారు.

అప్పాజంక్షన్:

అప్పా జంక్షన్ లో ప్రస్తుతం చదరపు అడుగు స్థలం ధర రూ. 6,450 పలుకుతోంది. ఈ రేటుతో 900 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లైతే రూ. 58,05,000 అవుతుంది. శివారు ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేస్తుండడంతో భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏరియాలో ప్రస్తుతం పెట్టుబడి పెట్టి ఏడాది పాటు వేచి చూసినట్లేతే చదరపు అడుగు ధర రూ. 8000 అయ్యిందనుకుంటే అప్పుడు మీరు ఆ స్థలాన్ని అమ్ముకుంటే రూ. 72,00,000 వస్తుంది. అంటే దాదాపు 14 లక్షలు లాభం వస్తుందన్నమాట.

మోకిలా:

మోకిలలో ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ. 4,350 గా ఉంది. ఈ రేటుతో 1200 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసినట్లైతే రూ. 60,90,000 అవుతుంది. ఈ ఏరియాలో కూడా భవిష్యత్తులో ఘణనీయమైన అభివృద్ధి జరగడం ఖాయం కాబట్టి ఊహించని లాభాలు అందుకోవచ్చంటున్నారు నిపుణులు.

కొల్లూర్:

కొల్లూరులో ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ. 5,350 డిమాండ్ చేస్తోంది. ఈ ధరతో 1800 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని కొన్నట్లైతే రూ. 96,30,000 అవుతుంది. సంవత్సరకాలం తర్వాత ధర పెరిగినట్లైతే రూ. 7000 అయ్యిందనుకుంటే 1,26,00,000 వస్తుంది. అంటే దాదాపు 30 లక్షల ప్రాఫిట్ మీ సొంతం చేసుకోవచ్చు.

నానక్రాంగూడ:

ఐటీకారిడార్ ప్రాంతమైన నానక్రాంగూడలో స్థలాలు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఈ ఏరియాలో ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ. 11,150గా ఉంది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినట్లైతే స్థలాల ధరలు భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయంటున్నారు. హైదరాబాద్ లోని ఈ నాలుగు ఏరియాల్లో స్థలాలు కొనుగోలు చేసి భవిష్యత్తులో అమ్ముకున్నట్లైతే వద్దన్నా లక్షల్లో లాభాలు వస్తాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి