వన్డే వరల్డ్ కప్-2023 ఆరంభానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి ఇంకా వెయిటింగ్ అవసరం లేదు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య గురువారం జరిగే మొదటి మ్యాచ్‌తో ప్రపంచ కప్ మొదలు కానుంది. 2019లో సొంతగడ్డ మీద జరిగిన వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ జట్టు ఖాతాలో అదే తొలి ప్రపంచ కప్ కావడం విశేషం. ఆ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది ఇంగ్లండ్. హోరాహోరీగా సాగిన ఆ ఫైనల్లో ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడ్డాయి.
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టై అయింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. కానీ అక్కడా ఫలితం తేలలేదు. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు బౌండరీ కౌంట్ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. దీంతో బౌండరీలు ఎక్కువ కొట్టిన ఇంగ్లండ్ ఛాంపియన్‌గా అవతరించింది. విజయానికి చేరువ దాకా వచ్చి కివీస్ తృటిలో కప్పును చేజార్చుకుంది. దీంతో న్యూజిలాండ్ ఫ్యాన్స్ కన్నీళ్లను ఆపులేకపోయారు. తొలిసారి వరల్డ్ కప్ గెలవడంతో ఇంగ్లండ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇక, భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌కు తొలి మ్యాచ్‌కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019 వరల్డ్ కప్ హీరో బెన్ స్టోక్స్ న్యూజిలాండ్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో బరిలోకి దిగడం అనుమానంగా మారింది.
ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టోక్స్ మొదటి మ్యాచ్ ఆడటం మీద సందేహాలున్నాయని ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెప్పాడు. తొంటి నొప్పితో బాధపడుతున్న స్టోక్స్ ఫిజియోల పర్యవేక్షణలో పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడని బట్లర్ తెలిపాడు. ట్రైనింగ్ సెషన్ తర్వాతే స్టోక్స్‌ను ఆడించాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతామని పేర్కొన్నాడు. ఎలాంటి రిస్క్ తీసుకోబోమని.. స్టోక్స్ పూర్తిగా కోలుకునే దాకా ఆడించబోమన్నాడు. ఒకవేళ కివీస్‌తో జరిగే మ్యాచ్‌కు స్టోక్స్ దూరమైతే ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించే కీలక ప్లేయర్ అయిన స్టోక్స్ గైర్హాజరీ ఆ టీమ్ కూర్పును దెబ్బతీసే అవకాశం ఉంది. ఒకవేళ స్టోక్స్ ఆడకపోతే అతడి ప్లేసులో హ్యారీ బ్రూక్ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇదీ చదవండి: జావెలిన్ త్రోలో సత్తా చాటిన నీరజ్ చోప్రా!
Ben Stokes likely to miss the opening match of World Cup tomorrow against New Zealand.
Harry Brook could play if Stokes misses out. (Daily Mail). pic.twitter.com/Y93ZD4eoB6
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023