iDreamPost

సత్తాచాటిన నీరజ్ చోప్రా.. జావెలిన్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌

సత్తాచాటిన నీరజ్ చోప్రా.. జావెలిన్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌

ఒలంపిక్ గేమ్స్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పతకాన్ని గెలుచుకున్న భాతర జావెలిన్ త్రోవర్ ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా సరికొత్త హిస్ట్రీని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఏషియన్ గేమ్స్ లో మరోసారి తన సత్తాచాటాడు. ఏషియన్ గేమ్స్ లో పసిడి పట్టు పట్టాడు. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ క్రీడల్లో నీరజ్ చోప్రా విజృంభించారు. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు.

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్‌ అదరగొడుతూ గోల్డ్ మెడల్స్ సాధిస్తుండగా తాజాగా ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఏషియన్ గేమ్స్‌లో నేడు జరిగిన పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచారు. 88.88 మీటర్లు ఈటెను విసిరి అగ్రస్థానంలో నిలిచారు. ఇదే ఈవెంట్‍లో భారత అథ్లెట్ కిశోర్ జెనా రజత పతకం గెలిచారు. 87.54 మీటర్లు ఈటెను విసిరిన కిశోర్.. రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. కాగా, జావెలిన్‌ త్రోలో రెండు పతకాలతో (గోల్డ్‌, సిల్వర్‌) భారత్‌ పతకాల సంఖ్య 80కి (17 గోల్డ్‌, 31 సిల్వర్‌, 32 బ్రాంజ్‌) చేరింది. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి