iDreamPost

VIDEO: ఆఫ్ఘాన్ టీమ్​కు సచిన్ మద్దతు! పాక్​ను ఇంటికి పంపడానికా?

  • Author singhj Published - 03:10 PM, Tue - 7 November 23

వరల్డ్ కప్​లో సంచలన విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న ఆఫ్ఘానిస్థాన్​కు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్​ మద్దతుగా నిలిచాడు. అయితే ఆఫ్ఘాన్​కు మాస్టర్ బ్లాస్టర్ సపోర్ట్​గా నిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వరల్డ్ కప్​లో సంచలన విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న ఆఫ్ఘానిస్థాన్​కు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్​ మద్దతుగా నిలిచాడు. అయితే ఆఫ్ఘాన్​కు మాస్టర్ బ్లాస్టర్ సపోర్ట్​గా నిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Author singhj Published - 03:10 PM, Tue - 7 November 23
VIDEO: ఆఫ్ఘాన్ టీమ్​కు సచిన్ మద్దతు! పాక్​ను ఇంటికి పంపడానికా?

ఆఫ్ఘానిస్థాన్.. నిన్న మొన్నటి దాకా క్రికెట్​లో పసికూనగా పరిగణించబడిన టీమ్. కానీ ఇప్పుడు ఆ జట్టు పేరు చెబితే బడా టీమ్స్ కూడా భయపడిపోతున్నాయి. ఆఫ్ఘాన్ సంచలన విజయాలతో దూసుకెళ్తుండటమే అందుకు కారణం. వన్డే వరల్డ్ కప్-2023లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా.. నాలుగు అద్భుత విజయాలు సాధించింది ఆఫ్గాన్ టీమ్. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్​ను తొలుత మట్టికరిపించింది. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంకలను చిత్తు చేసింది. నెదర్లాండ్స్ మీద కూడా నెగ్గి పాయింట్స్ టేబుల్​లో 6వ స్థానంలో నిలిచింది. ఈ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆఫ్ఘాన్ తమ ఎనిమిదో మ్యాచ్​లో భాగంగా పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. తర్వాతి మ్యాచ్​లో సౌతాఫ్రికాతో ఆడాల్సి ఉంది.

ఒకవేళ ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే ఆఫ్ఘాన్ నేరుగా సెమీస్​కు చేరుకుంటుంది. ఆసీస్, సౌతాఫ్రికాతో మ్యాచుల్లో ఒకదాంట్లో నెగ్గి, మరోదాంట్లో ఓడితే రన్​రేట్ కీలకం అవుతుంది. ఆ టీమ్ రన్​రేట్ తక్కువగా ఉంది కాబట్టి గెలవడంతో పాటు దాని మీద ఆ జట్టు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సెమీస్​లో నాలుగో బెర్త్ కోసం ప్రధానంగా న్యూజిలాండ్, పాకిస్థాన్​ టీమ్స్​తో ఆఫ్ఘాన్ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ ఆడే మ్యాచులు ఇంట్రెస్టింగ్​గా మారనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ (నవంబర్ 7) ఆసీస్-ఆఫ్ఘాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో ప్రస్తుత ఫామ్​ను కొనసాగిస్తూ కంగారూలకు షాకివ్వాలని ఆఫ్ఘాన్ భావిస్తోంది. అందులో భాగంగా ఆ టీమ్ ప్లేయర్లు నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపించారు.

ఆఫ్ఘాన్ ప్లేయర్లలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆఫ్ఘాన్ ప్రాక్టీస్ క్యాంప్​లో ప్రత్యక్షమయ్యాడు. రషీద్ ఖాన్ సహా ఇతర టీమ్ ప్లేయర్లకు సచిన్ విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ కనిపించాడు. ఆఫ్ఘాన్ క్రికెటర్స్​తో పాటు ఆ జట్టు సహాయ సిబ్బందితోనూ సచిన్ మాట్లాడాడు. కోచ్ జొనాథన్ ట్రాట్, మెంటార్ అజయ్ జడేజాతో పాత విషయాలను షేర్ చేసుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ రాకతో ఆఫ్ఘాన్ క్యాంప్​లో కొత్త ఉత్సాహం కనిపిచింది. ఆఫ్ఘాన్ క్రికెటర్స్​కు సచిన్ సూచనలు ఇస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. పాకిస్థాన్​ను ఇంటికి పంపేందుకే సచిన్ ఆఫ్ఘాన్​కు మద్దతు తెలిపాడని అంటున్నారు. మరి.. సచిన్ ఆఫ్ఘాన్ టీమ్​కు సపోర్ట్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: షమీ, జడేజానే పొగుడుతున్నారు.. అతడి కష్టం ఎవరికీ కనిపించడం లేదా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి