iDreamPost
android-app
ios-app

టీమిండియాతో మ్యాచ్​ అంటే పాకిస్థాన్​ భయపడుతోంది: మాజీ క్రికెటర్

  • Author singhj Published - 12:14 PM, Mon - 2 October 23
  • Author singhj Published - 12:14 PM, Mon - 2 October 23
టీమిండియాతో మ్యాచ్​ అంటే పాకిస్థాన్​ భయపడుతోంది: మాజీ క్రికెటర్

ప్రపంచ కప్​కు ముందు పాకిస్థాన్​కు ఏదీ కలసి రావడం లేదు. మెగా టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్​లో సూపర్​-4 దశలోనే దాయాది జట్టు నిష్క్రమించింది. టీమిండియాతో పాటు శ్రీలంక పైనా ఓడిపోవడంతో పాక్​ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ టైమ్​లో పాక్ డ్రెస్సింగ్ రూమ్​లో పరిస్థితులు బాగోలేవని.. ప్లేయర్ల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కెప్టెన్​ బాబర్ ఆజమ్​కు సలహా ఇచ్చేందుకు కూడా ఆటగాళ్లు వెనకడుగు వేస్తున్నారని న్యూస్ వచ్చింది. దీనిపై ఆ తర్వాత బాబర్ వివరణ ఇచ్చాడు. టీమ్​లో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని.. కానీ గొడవలేం జరగలేదని క్లారిటీ ఇచ్చాడు.

ఆసియా కప్ ముగిసినా పాకిస్థాన్ ఇంకా సెట్ అవ్వలేదు. ప్రపంచ కప్​కు ముందు సన్నాహకంగా జరిగిన వార్మప్ మ్యాచులో పాక్ సరిగ్గా ఆడలేదు. ఆ మ్యాచ్​లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. కివీస్​ ముందు భారీ టార్గెట్ ఉంచినా దాన్ని కాపాడుకోవడంలో పాక్ ఫెయిలైంది. 346 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఈ మ్యాచ్​లో పాక్ బౌలర్లు తేలిపోయారు. ఇది చూసిన అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆ టీమ్​ను తిట్టిపోస్తున్నారు. పాక్ టీమ్​లో ఐకమత్యం లోపించిందని మాజీ లెజెండ్ మొయీన్ ఖాన్ అన్నాడు.

పాకిస్థాన్​ జట్టులో ఐకమత్యం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ప్లేయర్ల మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరగట్లేదు. ఒకవేళ ఎవరైనా సలహాలు ఇచ్చినా బాబర్ ఫాలో అవుతున్నా అవి వర్కౌట్ అవ్వడం లేదు. మరో విషయం ఏంటంటే.. భారత్​తో మ్యాచ్ అంటే పాక్ ప్లేయర్లు వణికిపోతున్నారు. వాళ్ల సలహాలు పనిచేయవేమోనని భయపడుతున్నారు. కానీ ఒక ఆటగాడిగా టీమ్ కోసం వందశాతం కష్టపడాలి. ఇలా భయపడితే ఎలా? సలహాలు పనిచేయకపోయినా గెలవాలనే కసి మనలో ఉండాలి. బాడీ లాంగ్వేజ్​ను బట్టే అంతా తెలిసిపోతుంది. డ్రెస్సింగ్ రూమ్​లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది’ అని మొయీన్ ఖాన్ సూచించాడు.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​లో సౌతాఫ్రికా బలాలు, బలహీనతలు.. తొలి కప్ గెలిచే ఛాన్స్!