iDreamPost

Harbhajan Singh: అయోధ్యకు వెళ్లి తీరుతా.. ఎవరు ఆపుతారో చూస్తా: హర్భజన్ సింగ్

టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేడుకకు వెళ్లి తీరుతానని, నన్ను ఎవరు ఆపుతారో చూస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేడుకకు వెళ్లి తీరుతానని, నన్ను ఎవరు ఆపుతారో చూస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Harbhajan Singh: అయోధ్యకు వెళ్లి తీరుతా.. ఎవరు ఆపుతారో చూస్తా: హర్భజన్ సింగ్

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఈ పండుగ చూసేందుకు రామాలయ ట్రస్ట్ నిర్వాహకులు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా పంపారు. అందులో టీమిండియా క్రికెటర్లు, సినిమా, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ తో పాటుగా మరికొన్ని పార్టీలు ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ తాను మాత్రం అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేడుకకు వెళ్లి తీరుతానని, నన్ను ఎవరు ఆపుతారో చూస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హర్భజన్ సింగ్.. టీమిండియాలో ఉన్న విలక్షణమైన క్రికెటర్లలో ఒకడు. తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తూ ఉంటాడు భజ్జీ. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు టర్భోనేటర్ భజ్జీ. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ వేడుక కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది అయోధ్య రామ మందిర ఆలయ ట్రస్ట్. అయితే ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు విమర్శిస్తూ.. తాము ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లే విషయంపై ప్రముఖ మీడియా ఏఎన్ఐతో ఈ విధంగా మాట్లాడాడు.

bajji shocking comments

“అయోధ్యలోని రామ మందిర బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నేను వెళ్లి తీరుతాను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తా. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ వేడుకకు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లరు? అన్నది నాకు అనవసరం, ఆ విషయాలతో సంబంధం లేదు. ఇతర పార్టీల వారు వెళ్లొద్దని నిర్ణయించుకుంటే అది వారిష్టం. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను కచ్చితంగా వెళ్తాను. ఇక నేను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. నేనేమీ చేయలేను. అలాంటి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నేను పట్టించుకోను” అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్. ఇక ఈ వ్యాఖ్యలతో పరోక్షంగా సొంత పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకే సవాల్ విసిరాడు అని కొంత మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రామ మందిర ప్రారంభోత్సవానికి తాను జనవరి 22 తర్వాతే వెళ్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తెలిపారు. అందుకు కారణం సైతం ఆయన వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ట కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా తాను ఒక్కడినే వెళ్లాల్సి వస్తుందని, కానీ నాకు మాత్రం కుటుంబంతో అయోధ్యకు వెళ్లాలని ఉందని సీఎం కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అందుకే భార్యా, పిల్లలు, కుటుంబ సభ్యులతో జనవరి 22 తర్వాత అయోధ్యకు వస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి టీమిండియా దిగ్గజ క్రికెటర్లు అయిన సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, వెంకటేష్ ప్రసాద్, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లతో పాటుగా మరికొందరికి ఆహ్వానాలు అందాయి. మరి హర్భజన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి