iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్ కప్.. టీమిండియాకు బిగ్ బి స్పెషల్ మెసేజ్! వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్కా

  • Published May 02, 2024 | 12:46 PM Updated Updated May 02, 2024 | 12:46 PM

వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమిండియాకు స్పెషల్ మెసెజ్ ఇచ్చాడు బిగ్  బి. తాను లేటెస్ట్ గా నటిస్తున్న కల్కి మూవీలోని అశ్వత్థామ అవతారంలో వచ్చి.. క్రికెటర్లకు స్పూర్తినిచ్చాడు. ఇక ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా.

వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమిండియాకు స్పెషల్ మెసెజ్ ఇచ్చాడు బిగ్  బి. తాను లేటెస్ట్ గా నటిస్తున్న కల్కి మూవీలోని అశ్వత్థామ అవతారంలో వచ్చి.. క్రికెటర్లకు స్పూర్తినిచ్చాడు. ఇక ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా.

టీ20 వరల్డ్ కప్.. టీమిండియాకు బిగ్ బి స్పెషల్ మెసేజ్! వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్కా

ఐపీఎల్ 2024 ముగియగానే మరో మహా సంగ్రామం ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించే మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2024 స్టార్ట్ అవ్వనుంది. ఇక ఈ టోర్నీలో పాల్గొనే 20 దేశాలు ఒక్కొక్కటి తమ టీమ్స్ ను ప్రకటిస్తూ వస్తున్నాయి. టీమిండియా సైతం ఈ మినీ వార్ కోసం టీమ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమిండియాకు స్పెషల్ మెసెజ్ ఇచ్చాడు బిగ్  బి. తాను లేటెస్ట్ గా నటిస్తున్న కల్కి మూవీలోని అశ్వత్థామ అవతారంలో వచ్చి.. క్రికెటర్లకు స్పూర్తినిచ్చాడు. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా.

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. వారిలో స్ఫూర్తిని నింపేందుకు అశ్వత్థామ అవతారంలో వచ్చాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. “టీ20 వరల్డ్ కప్ కోసం శంఖనాదం మోగింది” అంటూ ఈ వీడియోను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వీడియోను కల్కి చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అశ్వత్థామ పాత్రలో బిగ్ బి కనిపిస్తూ.. క్రికెటర్లకు స్పూర్తి నింపే మాటలు చెబుతుంటే.. బ్యాగ్రౌండ్ లో కల్కీ మ్యూజిక్ వినిపిస్తోంది.

“ఇది మహా యుద్ధం. ఈ యుద్ధంలో మీరు గొప్పగా పోరాడండి. మీరు ఎక్కడా తలొంచొద్దు. ధైర్యంగా పోరాడి, మీ బలాన్ని ప్రదర్శించి.. ప్రతి తల్లి గర్వపడేలా చేయండి. మీ శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి.. అప్పుడు మీరు దేశం కోసం పూర్తిగా సిద్దమవుతారు” అశ్వత్థామ పాత్రలో బిగ్ బి క్రికెటర్లలో స్ఫూర్తి నింపారు. ఇక ఈ మాటలు చెప్పే క్రమంలో తెరపై సూర్యకుమార్, విరాట్ కోహ్లీ, రోహిత్, పాండ్యాలు కనిపించిన తీరు అద్భుతం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా.. అమితాబ్ కి క్రీడలంటే ఎంతో ఇష్టం అన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముంబైలో మ్యాచ్ లు జరిగితే వీలు చిక్కినప్పుడల్లా వెళ్లి చూస్తుంటాడు. ఇక ఇతర క్రీడాకారులు పతకాలు సాధించిన సందర్భంలో కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ వారిలో ఉత్తేజాన్ని నింపుతుంటాడు. ఇదిలా ఉండగా.. బిగ్ బి లేటెస్ట్ గా నటిస్తున్న కల్కి చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ లాంటి భారీ తారాగాణం కల్కిలో నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet