iDreamPost

లోన్ యాప్ వేధింపులకు స్టూడెంట్ బలి.. ఆ డబ్బులు తిరిగి కడతానన్న

చదువుకుని ఇంటికి ఆసరాగా నిలుస్తాడనుకున్న కొడుకు.. ఊహించని విధంగా ఉరి కొయ్యకు వేళాడుతూ కనిపించాడు. మరికొన్ని రోజుల్లో ఎంబీఎ పూర్తి చేసి.. ఉద్యోగంలో స్థిర పడతాడు అనుకున్నారు.. కానీ

చదువుకుని ఇంటికి ఆసరాగా నిలుస్తాడనుకున్న కొడుకు.. ఊహించని విధంగా ఉరి కొయ్యకు వేళాడుతూ కనిపించాడు. మరికొన్ని రోజుల్లో ఎంబీఎ పూర్తి చేసి.. ఉద్యోగంలో స్థిర పడతాడు అనుకున్నారు.. కానీ

లోన్ యాప్ వేధింపులకు స్టూడెంట్ బలి..  ఆ డబ్బులు తిరిగి కడతానన్న

అప్పు తీసుకున్నప్పుడు తీపిగా, తీర్చేటప్పుడు కారంగా ఉంటుంది. ఒకప్పుడు అప్పులు ఇవ్వడానికి .. సవాలక్ష ప్రశ్నలు, ఆస్తి పత్రాల తనాఖా, బ్యాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకునేవారు వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు. కానీ ఈ టెక్నాలజీ యుగంలో ఒక్క క్లిక్‌తో రుణాలు ఇచ్చేస్తున్నాయి ఫైనాన్షియల్ సంస్థలు. ఇటీవల లోన్ యాప్స్ ద్వారా రుణాలను తీసుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. కొన్ని గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు పడిపోతుండటంతో చాలా మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. అయితే సకాలంలో కడితే పర్వాలేదు.. కానీ ఒక్క నెల సరిగా కట్టకపోతే ఇక వేధింపులు మొదలవుతాయి. లోన్ యాప్స్ వేధింపులు తట్టుకోలేక.. పోలీసులతో పాటు సామాన్యులు మృత్యువాత పడిన సంగతి విదితమే.

ఈ వేధింపులు తాళలేక.. తాజాగా ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ నగరంలోని కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి యాకయ్య కుమారుడు విష్ణు వర్థన్ ఓ ప్రైవేట్ కాలేజీలో ఏంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం లోన్ యాప్స్‌ రూ. 60 వేలు రుణం తీసుకున్నాడు. అలాగే..ఫ్రెండ్స్ కోసం రూ. 2.40 లక్షలను ఇప్పించాడు. ఈ డబ్బులతో విష్ణు బెట్టింగ్స్ పెట్టేవాడు. అయితే ఆ లోన్స్‌కు సంబంధించి ఈఎంఐలు సరిగా చెల్లించలేదు. అలాగే తాను ఇప్పించిన ఫ్రెండ్స్ సైతం తిరిగి డబ్బులు సరిగా చెల్లించలేదు. దీంతో లోన్ యాప్ ఏజెంట్స్.. తరచూ ఫోన్ చేసి, డబ్బులు చెల్లించాలని వేధించడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వాళ్ల పేరెంట్స్ కూడా కాల్ చేసి విషయం చెప్పారు.

అయితే విష్ణు తండ్రి.. ఆ అప్పు తాను చెల్లిస్తానని, అతడ్ని వేధించవద్దు అంటూ ఏజెంట్లను వేడుకున్నాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో పాటు ఈ యాప్ లోన్స్ ఏజెంట్ల వేధింపులతో మనస్థాపానికి గురైన విష్ణు వర్థన్ మంగళవారం అర్థరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసే సరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. చేతికొచ్చిన కొడుకుని అలా చూసి కన్నీరుమున్నీరు అయ్యారు తల్లిదండ్రులు. చదువుకుని.. తమకు అండగా, ఆసరాగా నిలుస్తాడనుకున్న కొడుకు బెట్టింగ్ మోజులో పడి అప్పులు చేసి ప్రాణం మీదకు తెచ్చుకోవడంతో శోక సంద్రంలో మునిగిపోయారు పేరేంట్స్. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి